తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఈఏపీసెట్ (TG EAPCET) 2026 కౌన్సెలింగ్ అధికారిక షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఏడాది ప్రవేశాల ప్రక్రియను వేగంగా ముగించి, సకాలంలో అకడమిక్ ఇయర్ ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు.

మూడు విడతల్లో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియను అధికారులు నిర్వహిస్తారు. జూన్ 19వ తేదీ నుంచి మెుదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ మెుదలవుతుంది. జూన్ 28వ తేదీదాకా స్లాట్ బుకింగ్ అవకాశం ఉంటుంది. జూన్ 22 నుంచి 29 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉండనుంది. జూన్ 25 నుంచి జూలై 1వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు అవకాశం కల్పిస్తారు. జూలై 4వ తేదీన మాక్ సీట్ అలకేషన్ నిర్వహిస్తారు. జూలై 10వ తేదీన మెుదటి విడత సీట్లను ప్రకటిస్తారు. జూలై 10వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి.
సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్
- జూలై 17 నుంచి సెకండ్ ఫేజ్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ మెుదలు
- జూలై 17 స్లాట్ బుకింక్ అవకాశం
- జూలై 18న సర్టిఫికెట్ల వెరిఫికేషన్
- జూలై 18, 19 తేదీల్లో వెబ్ ఆప్షన్స్
- జూలై 25 నుంచి 28 లోపు సెల్ఫ్ రిపోర్టింగ్
- జూలై 28 వరకు సీట్ రద్దు చేసుసుకునేందుకు అవకాశం
థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్
- జూలై 31 నుంచి మూడో విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్
- జూలై 31 వెబ్ ఆప్షన్స్ అవకాశం
- ఆగస్టు 1న సర్టిఫికెట్ల వెరిఫికేషన్
- ఆగస్టు 5న సీట్ల కేటాయింపు
- ఆగస్టు 5 నుంచి 7లోపు వెబ్‌సైట్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్
- 12, 13 తేదీల్లో బ్రాంచ్ మారాలనుకునేవారికి వెబ్ ఆప్షన్స్
- ఆగస్టు 15వ తేదీన సీట్లు కేటాయింపు
మొదటి విడతలో సీటు రాని వారు, కొత్తగా దరఖాస్తు చేసుకునే వారి కోసం జూలై 2026 లోనే రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మిగిలిపోయిన సీట్ల భర్తీకి జూలై 31న మూడో విడత కౌన్సెలింగ్ మెుదలవుతుంది. ఈ మూడు విడతల ప్రక్రియ ముగిసిన అనంతరం, ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి సంబంధించి ఆగస్టు చివరి వారంలో స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలను విడుదల చేస్తారు.
{{/usCountry}}మొదటి విడతలో సీటు రాని వారు, కొత్తగా దరఖాస్తు చేసుకునే వారి కోసం జూలై 2026 లోనే రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మిగిలిపోయిన సీట్ల భర్తీకి జూలై 31న మూడో విడత కౌన్సెలింగ్ మెుదలవుతుంది. ఈ మూడు విడతల ప్రక్రియ ముగిసిన అనంతరం, ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి సంబంధించి ఆగస్టు చివరి వారంలో స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలను విడుదల చేస్తారు.
{{/usCountry}}