...
...
Next Story

TG EAPCET Seat Allotment : టీజీ ఈఏపీసెట్ మొదటి రౌండ్ సీట్ల కేటాయింపు - అలాట్‌మెంట్ లింక్, రిపోర్టింగ్ తేదీలివే

TG EAPCET Seat Allotment : టీజీ ఈఏపీసెట్ 2026 ఇంజనీరింగ్ మొదటి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. మొత్తం 88,053 సీట్లకు గాను 79,891 మందికి సీట్లు దక్కాయి. జూలై 14 లోగా సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది.

Published on: Jul 11, 2026, 09:44:31 IST
Advertisement

TG EAPCET Seat Allotment : టీజీ ఈఏపీసెట్ - 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన మొదటి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ ముగిసింది.విద్యార్థులు తమకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ tgeapcet.nic.in లో లాగిన్ అయి చెక్ చేసుకోవచ్చు.

టీజీ ఈఏపీసెట్ 2026
టీజీ ఈఏపీసెట్ 2026

ఈ ఏడాది కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా జూన్ 22 నుంచి 29 వరకు అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించారు. ఈ ప్రక్రియకు మొత్తం 89,450 మంది అభ్యర్థులు హాజరై… వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకున్నారు.

జూలై 5 నుంచి 7 వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లను ఎంచుకున్నారు. మొత్తం 88,510 మంది అభ్యర్థులు ఈ ప్రక్రియలో పాల్గొనగా…. మొత్తంగా 55,63,270 ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. అభ్యర్థులు సాధించిన ర్యాంకులు, ఎంచుకున్న వెబ్ ఆప్షన్లు ఆధారంగా…. అధికారులు సీట్లు కేటాయించారు.

రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఇంజినీరింగ్ కళాశాలల్లో అందుబాటులో ఉన్న మొత్తం 88,053 సీట్లకు గాను, తొలి విడతలో 79,891 మంది అభ్యర్థులకు సీట్లను కేటాయించారు. దీంతో మొదటి విడత ముగిసేసరికి ఇంకా 8,162 సీట్లు ఖాళీగా మిగిలాయి. ఈ మిగిలిపోయిన సీట్లను రాబోయే తదుపరి విడత (రెండో విడత) కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్నారు.

జూలై 14 లోగా రిపోర్టింగ్ తప్పనిసరి

మొదటి విడతలో సీట్లు పొందిన అభ్యర్థులు కౌన్సెలింగ్ నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్ ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించిన అనంతరం వెబ్‌సైట్ లోనే సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాలి. అభ్యర్థులు జూలై 14వ తేదీ వరకు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయడానికి గడువు విధించారు.

టీజీ ఈఏపీసెట్ - 2026 రెండో విడత కౌన్సెలింగ్ జులై 17వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. జులై 18న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించనుండగా, జులై 18, 19 తేదీల్లో విద్యార్థులు రెండో విడత వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని కూడా విద్యార్థులు పైన పేర్కొన్న అధికారిక వెబ్‌సైట్ ద్వారానే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe