TG EAPCET 2026 Results : టీజీ ఈఏపీసెట్ అభ్యర్థులకు అప్డేట్ - ఫలితాలు ఎప్పుడంటే..?

TG EAPCET 2026 Results :  టీజీ ఎప్‌సెట్ 2026 ఫలితాల విడుదలకు కసరత్తు కొనసాగుతోంది. ఈనెల 25న ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. 

Published on: May 14, 2026, 13:24:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

TG EAPCET 2026 Results : రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఈఏపీసెట్ ఫలితాలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే ప్రాథమిక కీలను విడుదల చేయగా…. తుది ఫలితాలను ప్రకటించేందుకు జేఎన్టీయూ కసరత్తు చేస్తోంది. అన్ని కుదిరితే ఈనెల 25వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఈ తేదీ కుదరకపోతే ఒకరోజు అటు ఇటు కావొచ్చని సమాచారం. మొత్తంగా… ఈనెలాఖారులోపే ఈ ఫలితాలను ప్రకటించే సూచనలున్నాయి.

టీజీ ఈఏపీసెట్ - 2026 ఫలితాలు (image source istock)
టీజీ ఈఏపీసెట్ - 2026 ఫలితాలు (image source istock)

పరీక్షలు విజయవంతంగా ముగియడంతో,… ప్రస్తుతం ఫలితాలను ప్రాసెసింగ్ చేస్తున్నారు. ఇప్పటికే అగ్రికల్చర్, ఫార్మసీ ప్రాథమిక కీలపై అభ్యంతరాలను స్వీకరించారు. ఇక ఇంజినీరింగ్ స్ట్రీమ్ ప్రాథమిక కీపై అభ్యంతరాలకు ఇవాళ్టితో గడువు పూర్తి కానుంది. ఈ గడువు ముగిస్తే… అభ్యంతరాలను పరిశీలించి… తుది కీలతో పాటు ర్యాంకులను సిద్ధం చేస్తారు.

టీజీ ఈఏపీసెట్ - 2026 ఫలితాలు ఎప్పుడు.. ?

మే 25వ తేదీన టీజీ ఈఏపీసెట్ ఫలితాలను వెల్లడించాలని ప్రాథమికంగా నిర్ణయించినప్పటికీ… ఒకవేళ సాంకేతిక కారణాల వల్ల ఆ రోజు వీలు కాకపోతే.. మరుసటి రోజైన మే 26న ఫలితాలు విడుదల చేసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఫలితాల వెల్లడి అనంతరం ర్యాంకుల ఆధారంగా ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఎప్‌సెట్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలు విడుదలైన వెంటనే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్(eapcet.tsche.ac.in)) ద్వారా తమ ర్యాంక్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫలితాల వెల్లడి తేదీపై ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఈసారి ఇంజినీరింగ్ పరీక్షలను మొత్తం ఆరు షిఫ్టుల్లో నిర్వహించారు. ఈ పరీక్షల కోసం 2,10,766 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 1,97,241 (దాదాపు 93.5%) మంది పరీక్షకు హాజరైనట్లు పరీక్ష కన్వీనర్ విజయకుమార్‌రెడ్డి వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి విద్యార్థుల హాజరు శాతం ఆశాజనకంగా ఉందని అధికారులు భావిస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More