రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఈఏపీసెట్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా 2026 -2027 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కల్పిస్తారు. ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 19 నుంచి మొదలవుతాయి. అయితే తాజాగా అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. సిలబస్ వివరాలను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.
TG EAPCET 2026 - సిలబస్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి
- విద్యార్థులు ముందుగా https://eapcet.tgche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో కనిపించే సమాచారం సెక్షన్ లో సిలబస్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ ఇంజినీరింగ్ స్ట్రీమ్ (Engineering Stream (E)), అగ్రికల్చర్ - ఫార్మసీ స్ట్రీమ్(Agriculture & Pharmacy Stream (A & P)) ఆప్షన్ కనిపిస్తాయి.
- మీరు ఏ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారో ఆ స్ట్రీమ్ లింక్ పై క్లిక్ చేయాలి.
- సిలబస్ వివరాలతో కూడిన పీడీఎఫ్ అందుబాటులో ఉంటుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా సిలబస్ కాపీని పొందవచ్చు.
దరఖాస్తుల ప్రక్రియ - ముఖ్యమైన తేదీలు

ఫిబ్రవరి 19 నుంచి టీజీ ఈఏపీసెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రాసెస్ ప్రారంభమవుతుంది. ఫైన్ లేకుండా ఏప్రిల్ 4వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫైన్ తో అయితే… మే 2 వరకు ఛాన్స్ ఉంటుంది.
టీజీ EAPCET -2026 పరీక్షల నిర్వహణ తేదీలు చూస్తే.. మే 4, మే 5న అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు ఉంటాయి. మే 9 నుంచి మే 11 వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. పరీక్షలు పూర్తి అయిన తర్వాత ప్రాథమిక కీలను ప్రకటించి… అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం ర్యాంకులను వెల్లడించారు. ఈసారి కూడా జేఎన్టీయూనే ఎంట్రెన్స్ బాధ్యతలను చూడనుంది.
- ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం - 19 ఫిబ్రవరి 2026
- ఫైన్ లేకుండా చివరి తేదీ - 4 ఏప్రిల్ 2026.
- రూ. 250 ఫైన్ తో దరఖాస్తులకు చివరి తేదీ - 10-04-2026
- రూ. 500 ఫైన్ తో చివరి తేదీ - 15-04-2026
- రూ. 2,500 ఆలస్య రుసుంతో చివరి తేదీ - 20-04-2026
- రూ. 5,000 ఆలస్య రుసుంతో చివరి తేదీ - 24-04-2026
- రూ. 10,000 ఆలస్య రుసుంతో చివరి తేదీ - : 02-05-2026)
- ఇంటర్ పూర్తి అయిన విద్యార్థులు టీజీ EAPCET పరీక్ష రాసేందుకు అర్హులవుతారు.
- టీజీ ఈఏపీసెట్ -2026 (బైపీసీ స్ట్రీమ్) పరీక్ష తేదీలు - మే 4, మే 5న అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు ఉంటాయి.
- టీజీ ఈఏపీసెట్ - 2026(ఇంజినీరింగ్ స్ట్రీమ్) పరీక్ష తేదీలు - మే 9 నుంచి మే 11 వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు.
- అధికారిక వెబ్ సైట్ - https://eapcet.tgche.ac.in/
టీజీ ఈఏపీసెట్ - 2026 పరీక్షలు పూర్తి అయిన తర్వాత ప్రాథమిక కీలను ప్రకటించి… అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం ర్యాంకులను వెల్లడించారు. అభ్యర్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. విడతల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించి… సీట్లను భర్తీ చేస్తారు.
టీజీ ఈఏపీసెట్ - ప్రశ్నలు, జవాబులు (FAQ)
- టీజీ ఈఏపీసెట్ ఏంటి..?
టీజీ ఈఏపీసెట్ - 2026 పరీక్షలు పూర్తి అయిన తర్వాత ప్రాథమిక కీలను ప్రకటించి… అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం ర్యాంకులను వెల్లడించారు. అభ్యర్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. విడతల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించి… సీట్లను భర్తీ చేస్తారు.
టీజీ ఈఏపీసెట్ - ప్రశ్నలు, జవాబులు (FAQ)
- టీజీ ఈఏపీసెట్ ఏంటి..?
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంట్రెన్స్ ఎగ్జామ్. గతంలో ఈ పరీక్షను ఎంసెట్ (EAMCET) పేరుతో నిర్వహించేవారు. ఆ తర్వాత ఈ పేరును TG EAPCET(టీజీ ఈఏపీసెట్)గా మార్చారు.
2. టీజీ ఈఏపీసెట్ పరీక్ష విధానం ఎలా ఉంటుంది..?
ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో టీజీ ఈఏపీసెట్ పరీక్ష జరుగుతుంది. మొత్తం 160 ప్రశ్నలుంటాయి. 3 గంటల సమయం ఉంటుంది, నెగటివ్ మార్కింగ్ లేదు. ఇంజినీరింగ్ స్ట్రీమ్, అగ్రికల్చర్ - ఫార్మసీ స్ట్రీమ్‌లకు వేర్వేరుగా పరీక్షలు నిర్వహిస్తారు.
3. టీజీ ఈఏపీసెట్ సీట్ల కేటాయింపు ఎలా ఉంటుంది..?
టీజీ ఈఏపీసెట్ పరీక్ష తర్వాత ఫలితాలను ప్రకటిస్తారు. ఇందులో మంచి ర్యాంకులు సాధించిన వారికి పేరొందిన కాలేజీల్లో సీట్లు దక్కే అవకాశం ఉంటుంది. ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో సాధించే స్కోరును బట్టి ర్యాంకులను ప్రకటిస్తారు.