...
...
Next Story

TG EAPCET 2026 : టీజీ ఈఏపీసెట్ అభ్యర్థులకు కొత్త అప్డేట్ - ఎడిట్ ఆప్షన్ వచ్చేసింది..! ఇలా ప్రాసెస్ చేసుకోండి

TG EAPCET Application Edit 2026: టీజీ ఈఏపీసెట్ - 2026 అభ్యర్థులకు మరో అప్డేట్ వచ్చింది. ఆన్ లైన్ దరఖాస్తులో ఏమైనా తప్పులుంటే సవరించుకునేందుకు ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది.

Published on: Apr 06, 2026 09:07 AM IST
Advertisement

రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఈఏపీసెట్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఎలాంటి ఫైన్ లేకుండా ఏప్రిల్ 4వ తేదీతో గడువు ముసిగింది. ప్రస్తుతం ఆలస్య రుసుంతో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. లేట్ ఫీజుతో మే 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.

టీజీ ఈఏపీసెట్ - 2026
టీజీ ఈఏపీసెట్ - 2026

టీజీ ఈఏపీసెట్ అభ్యర్థులకు అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. ఆన్ లైన్ దరఖాస్తులో ఏమైనా తప్పులుంటే వెంటనే సవరించుకోవాలని సూచించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్రాసెస్ చేసుకోవాలని సూచించారు. కేవలం ఒక్కసారి మాత్రమే ఈ అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.

టీజీ ఈఏపీసెట్ 2026 - అప్లికేషన్ ఎడిట్ ఇలా….

  1. ముందుగా https://eapcet.tgche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలోని ‘Correction of Online Application Data’లింక్ పై క్లిక్ చేయాలి.
  3. ఇక్కడ అభ్యర్థి రిజిస్ట్రేషన్ నెంబర్, పేమెంట్ రిఫరెన్స్ ఐడీ, క్వాలిఫైయింగ్ ఎగ్జామనిషన్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
  4. ఫిల్ అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేస్తే దరఖాస్తు ఫారమ్ ఓపెన్ అవుతుంది.
  5. తప్పులుగా ఉన్న వివరాలను సరి చేసుకునే వీలుంటుంది.
  6. చివరగా సబ్మిట్ చేస్తే ప్రాసెస్ పూర్తవుతుంది.
  7. ఎడిట్ ఆప్షన్ కు ఒక్కసారి మాత్రమే వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఎడిట్ చేసుకోవాలి.

ఇంజినీరింగ్ స్ట్రీమ్ అప్లికేషన్ కోసం సాధారణ ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 500, ఇతరులు రూ. 900 చెల్లించాలి. ఇక అగ్రికల్చర్ స్ట్రీమ్ కింద ఎస్సీ, ఎస్సీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 500, ఇతరులు రూ. 900 చెల్లించాలి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ స్ట్రీమ్ కు కలిపి దరఖాస్తు చేసుకుంటే…. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 1000, ఇతరులు రూ. 1800 చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 4వ తేదీ వరకు మాత్రమే ఈ ఫీజులున్నాయి.ఈ తేదీ పూర్తి కావటంతో…. ఈ ఫీజుతో పాటు ఆలస్య రుసుంను కూడా చెల్లించాల్సి ఉంటుంది. అధికారిక వెబ్ సైట్ https://eapcet.tgche.ac.in/ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాలి.

ఈ లింక్ పై క్లిక్ చేసి టీజీ ఈఏపీసెట్ - 2026 దరఖాస్తును ఎడిట్ చేసుకోవచ్చు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe