...
...
Next Story

TG EAPCET Hall Ticket 2026 : టీజీ ఈఏపీసెట్ అభ్యర్థులకు అలర్ట్ - ఇవాళ హాల్ టికెట్లు విడుదల

TG EAPCET Hall Ticket 2026 : టీజీ ఈఏపీసెట్ - 2026 అగ్రికల్చర్, ఫార్మసీ హాల్‌టికెట్లు గురువారం నుంచి అందుబాటులోకి వస్తాయి. ఇంజినీరింగ్ విభాగం అభ్యర్థులు.. ఈ నెల 27 నుంచి వారి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Published on: Apr 23, 2026, 08:35:35 IST
Advertisement

రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఈఏపీసెట్ కి సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. అగ్రికల్చర్ - ఫార్మసీ స్ట్రీమ్ విభాగం పరీక్షలు మే 4, 5 తేదీల్లో జరగనున్నాయి. అయితే వీటికి సంబంధించిన హాల్‌టికెట్లు నేటి నుంచి అందుబాటులోకి వస్తాయి. ఉదయం 11 గంటల తర్వాత వెబ్‌సైట్‌ ( eapcet.tgche.ac.in ) ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఎప్‌సెట్‌ హాల్‌టికెట్లు
ఎప్‌సెట్‌ హాల్‌టికెట్లు

ఇక ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు మే 9, 10, 11 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ అభ్యర్థులు వారి హాల్‌టికెట్లను ఏప్రిల్ 27వ తేదీ మధ్యాహ్నం నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది ఎప్‌సెట్ రాయడానికి విద్యార్థుల నుంచి భారీ స్పందన లభించింది. ఇంజినీరింగ్ విభాగానికి ఏకంగా 2,10,308 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా…. అగ్రికల్చర్ మరియు ఫార్మసీ విభాగాలకు 90,569 మంది దరఖాస్తు చేశారు. రెండు విభాగాల పరీక్షలు రాసేందుకు 317 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. అగ్రికల్చర్ విభాగం కోసం 106 కేంద్రాలను కేటాయించారు. ఇంజినీరింగ్ విభాగం పరీక్షల కోసం 115 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.

పరీక్షా సమయానికి కనీసం గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని…. నిమిషం ఆలస్యమైనా అనుమతించే ప్రసక్తి లేదని అధికారులు స్పష్టం చేశారు. హాల్‌ టికెట్‌తో పాటు ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డును వెంట ఉంచుకోవాలని సూచించారు.

  • అగ్రికల్చర్ - ఫార్మసీ: ఈ విభాగం పరీక్షలు మే 4, 5 తేదీల్లో జరగనున్నాయి. వీటికి సంబంధించిన హాల్‌టికెట్లను గురువారం ఉదయం 11 గంటల నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.
  • ఇంజినీరింగ్: ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు మే 9, 10, 11 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను ఏప్రిల్ 27వ తేదీ మధ్యాహ్నం నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe