TG EAPCET 2026 Bipc Stream Counseling : ఇంటర్‌మీడియట్‌లో బైపీసీ పూర్తి చేసి… టీజీ ఈఏపీసెట్ (TG EAPCET) అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగం ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. రాష్ట్రంలోని బి-ఫార్మసీ, ఫార్మా-డీ, ఇతర సాంకేతిక, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల భర్తీకి సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ ఈరోజే (శనివారం) ప్రారంభమైంది.
నేటి నుంచే రిజిస్ట్రేషన్లు - ముఖ్య తేదీలు
- ప్రాసెస్ ఫీజు, స్లాట్ బుకింగ్ : ఈ నెల 12 నుంచి 16 వరకు విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ (https://tgeapc etb.nic.in) ద్వారా ప్రాసెసింగ్ ఫీజు చెల్లించుకోవచ్చు.
- ధ్రువపత్రాల పరిశీలన: స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 15 నుంచి 17 వరకు సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగుతుంది.
- వెబ్ ఆప్షన్లు : సర్టిఫికెట్ల సర్టిఫికేషన్ పూర్తయిన విద్యార్థులు ఈ నెల 16 నుంచి 20 వరకు తమకు నచ్చిన కళాశాలలు, కోర్సులకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది.
- సీట్ల కేటాయింపు : మొదటి విడత సీట్ల కేటాయింపు ఈ నెల 22న లేదా ఆలోగా ప్రకటిస్తారు.
- అధికారిక వెబ్ సైట్ - https://tgeapcetb.nic.in/Default.aspx

కన్వీనర్ కోటా కింద బైపీసీ అభ్యర్థులకు మొత్తం ఐదు రకాల విభిన్న కోర్సులలో ప్రవేశాలు లభిస్తాయి. వివిధ కోర్సుల వారీగా అందుబాటులో ఉన్న కళాశాలలు, సీట్ల వివరాలిలా ఉన్నాయి…
- బి-ఫార్మసీ (B.Pharmacy) : 124 కళాశాలల్లో మొత్తం 8,473 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
- ఫార్మా-డీ (Pharm-D) : 72 కళాశాలల్లో 1,567 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
- బీటెక్ బయో-టెక్నాలజీ (B.Tech Bio-Technology): 6 కళాశాలల్లో 239 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
- ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ (Pharmaceutical Engineering): 4 కళాశాలల్లో 170 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
- బీటెక్ బయో-మెడికల్ (B.Tech Bio-Medical Engineering): 2 కళాశాలల్లో 37 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ప్రత్యేక రిజర్వేషన్ వర్గాల కౌన్సెలింగ్ ఎన్సీసీ (NCC), స్పోర్ట్స్ (Sports), దివ్యాంగులు (PHC), మాజీ సైనిక ఉద్యోగుల పిల్లలు వంటి కేటగిరీలకు చెందిన విద్యార్థులకు హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని ప్రభుత్వ సైన్స్ కళాశాలలో ప్రత్యేకంగా ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు.
వీరికి సెప్టెంబర్ 15 నుంచి 17 వరకు నిర్ణీత స్లాట్ల ప్రకారం కౌన్సెలింగ్ జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులు ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా తమకు నచ్చినన్ని వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలని, చివరి నిమిషం దాకా వేచిచూడకుండా నిర్దేశిత గడువులోగా స్లాట్ బుకింగ్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని కన్వీనర్ సూచించారు.
ఇక ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ సెప్టెంబర్ 25న ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 26న సర్టిఫికెట్ల పరిశీలన, సెప్టెంబర్ 26,27 తేదీలలో ఆప్షన్ ఎంట్రీ జరుగుతాయి. తుది దశ సీట్ల కేటాయింపు సెప్టెంబర్ 29న లేదా అంతకంటే ముందు ప్రకటిస్తారు. అభ్యర్థులు సెప్టెంబర్ 29 నుండి 30 వరకు ఆన్లైన్లో ట్యూషన్ ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాలి.
{{/usCountry}}ఇక ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ సెప్టెంబర్ 25న ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 26న సర్టిఫికెట్ల పరిశీలన, సెప్టెంబర్ 26,27 తేదీలలో ఆప్షన్ ఎంట్రీ జరుగుతాయి. తుది దశ సీట్ల కేటాయింపు సెప్టెంబర్ 29న లేదా అంతకంటే ముందు ప్రకటిస్తారు. అభ్యర్థులు సెప్టెంబర్ 29 నుండి 30 వరకు ఆన్లైన్లో ట్యూషన్ ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాలి.
{{/usCountry}}కౌన్సెలింగ్ కోసం TG EAPCET 2026 ర్యాంక్ కార్డ్, TG EAPCET 2026 హాల్ టికెట్, ఆధార్ కార్డ్, పదవ తరగతి మార్కుల మేమో (పుట్టిన తేదీ ధ్రువీకరణ కోసం) , ఇంటర్మీడియట్ మార్కుల మేమో, 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు స్టడీ/బోనాఫైడ్ సర్టిఫికేట్లు, టీసీ, రిజర్వేషన్, స్కాలర్‌షిప్ కోసం అవసరమైన పత్రాలు ఆదాయ ధ్రువీకరణ పత్రం, కులం ధ్రువీకరణ పత్రం, ఓపెన్ కేటగిరీ వర్తిస్తే EWS సర్టిఫికేట్, నివాస ధ్రువీకరణ పత్రం లాంటి పత్రాలు ఉండాలి.