రాష్ట్రంలో ఇళ్లు లేని పేదల విషయంలో తెలంగాణ సర్కార్ మరో ఆలోచన చేస్తోంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ను పట్టాలెక్కించగా… చాలా చోట్ల లబ్ధిదారులు నిర్మాణాలు పూర్తి చేసుకుంటున్నారు. గృహా ప్రవేశాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ ఇళ్లను కేవలం ఖాళీ స్థలాలు ఉన్నవారికి మాత్రమే కేటాయించారు.
వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు…

ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కోసం ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 జాబితాలను రూపొందించిన సంగతి తెలిసిందే. ఎల్ 1 కింద ఖాళీ జాగ ఉన్నవారి వివరాలను నమోదు చేయగా… ఎల్ 2లో జాగలు లేని వివరాలను పొందుపరిచారు. ఇక ఎల్ 3లో ఉన్న వారిని అనర్హులుగా ప్రకటించారు. అయితే ఇళ్లు జాగలేని వారి కోసం ప్రభుత్వం మరో ఆలోచన చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించాలని భావిస్తోంది.
గత బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో మొత్తం 2.90 లక్షల ఇళ్లను మంజూరు చేశారు. ఇప్పటి వరకు 1.62 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇందులో 1.46 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించారు. మరో 1.54 లక్షల ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. ఈ ఇళ్లలో కొన్ని ఇప్పటికే నిర్మాణాలు పూర్తికాగా…. మరికొన్ని వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. వీటి లెక్కలను ఇప్పటికే సేకరించిన గృహ నిర్మాణశాఖ…. వీటిని కేటాయించే విషయంపై కసరత్తు చేస్తోంది.
ఇప్పటికి కేటాయించకుండా ఉన్న వాటిని ఎల్ 2 జాబితాలో ఉన్న వారికి కేటాయించాలని సర్కార్ భావిస్తోంది. ఈ ప్రక్రియను కూడా వచ్చే సెప్టెంబర్ నెలలోపే పూర్తి చేయాలని చూస్తోంది. ఆయా చోట్ల ప్రస్తుతం ఉన్న మౌలిక వసతులపై కూడా ప్రభుత్వం ఆరా తీస్తోంది. పురోగతిలో ఉన్న పనులు కూడా ఎప్పటి వరకల్లా పూర్తవుతాయనే దానిపై కూడా సమాచారం సేకరిస్తోంది. పూర్తి అయిన వాటిని వీలైనంత త్వరగా కేటాయించాలని భావిస్తోంది. లబ్ధిదారుల ఎంపికను కూడా పారదర్శకంగా చేయాలని నిర్ణయించింది. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన జారీ అయ్యే అవకాశం ఉంది.
మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ రెండో విడతపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రెండో విడత పంపిణీ కార్యక్రమాన్ని ఏప్రిల్ లో ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ప్రకటన చేశారు. ఇందిరమ్మ కమిటీల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పారు. ఇక హైదరాబాద్ తో పాటు పట్టణ ప్రాంతాల్లో జీ ప్లస్ 4 పద్దతిలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించే విధంగా త్వరలో ఇందిరమ్మ అర్బన్ హౌసింగ్ పాలసీని ప్రకటించే విషయంపై కూడా ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేయనుంది.
{{/usCountry}}మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ రెండో విడతపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రెండో విడత పంపిణీ కార్యక్రమాన్ని ఏప్రిల్ లో ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ప్రకటన చేశారు. ఇందిరమ్మ కమిటీల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పారు. ఇక హైదరాబాద్ తో పాటు పట్టణ ప్రాంతాల్లో జీ ప్లస్ 4 పద్దతిలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించే విధంగా త్వరలో ఇందిరమ్మ అర్బన్ హౌసింగ్ పాలసీని ప్రకటించే విషయంపై కూడా ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేయనుంది.
{{/usCountry}}