...
...
Next Story

TG Gurukul CET 2026 : గురుకులాల్లో 5వ తరగతి అడ్మిషన్లు - దరఖాస్తులకు ఇవాళే చివరి తేదీ

టీజీ గురుకుల సెట్ - 2026 దరఖాస్తుల గడువు ఇవాళ్టితో పూర్తి కానుంది. 5వ తరగతిలో ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థులు… దరఖాస్తు చేసుకోవచ్చు. https://tgcet.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు.

Published on: Jan 25, 2026, 12:25:42 IST
Advertisement

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఈ గడువు ఇవాళ్టితో పూర్తి కానుంది. మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండటంతో… అర్హత ఉన్న విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఓసారి గడువు పొడిగించిన నేపథ్యంలో… మరోసారి పొడిగించే అవకాశం లేదు.

తెలంగాణ గురుకులాల్లో అడ్మిషన్లు
తెలంగాణ గురుకులాల్లో అడ్మిషన్లు

టీజీ గురుకుల సెట్ - 2026 నోటిఫికేషన్ లో భాగంగా 2026-27 విద్యా సంవత్సరం కింద ఐదో తరగతిలో ప్రవేశాలు ((TGSWREIS, TGTWREIS, MJPTBCWREIS,TGREIS) కల్పిస్తారు. ప్రస్తుతం నాల్గో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ రాసేందుకు అర్హులవుతారు.ప్రభుత్వ ఆధ్వర్యంలోని 4 గురుకుల సొసైటీలలో ఈ ఎంట్రెన్స్ ద్వారానే అడ్మిషన్లను పూర్తి చేస్తారు.

ఈ ప్రవేశ పరీక్షను వచ్చే ఫిబ్రవరి 22వ తేదీన నిర్వహిస్తారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది. అన్ని జిల్లాల్లోని నిర్ణీత పరీక్షా కేంద్రాల్లో కొనసాగే ఈ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ ఫీజు రూ.100గా నిర్ణయించారు.

TGCET 2026 - అప్లికేషన్ ప్రాసెస్….

  1. ముందుగా https://tgcet.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. క్లిక్ ఇయర్ ఫర్ ఇంపార్టెంట్ లింక్స్ పై క్లిక్ చేయాలి.
  3. హోం పేజీలోని పేమెంట్ లింక్ పై క్లిక్ చేసి నిర్ణయించిన ఫీజును చెల్లించాలి.
  4. ఆ తర్వాత హోంపేజీలో కనిపించే అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేయాలి.
  5. ఇక్కడ పేమెంట్ వివరాలు, పేమెంట్ చేసిన తేదీ, దరఖాస్తు చేసుకునే అభ్యర్థి పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
  6. సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ పూర్తి వివరాలను నమోదు చేయటంతో పాటు ఫొటోను అప్ లోడ్ చేయాలి.
  7. చివరగా సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది.
  8. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి రిజిస్ట్రేషన్ కాపీని పొందవచ్చు
  9. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే సమయంలో రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలి. కాబట్టి జాగ్రత్తగా ఉంచుకోవాలి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks