...
...
Next Story

TG Gurukul CET 2026 : తెలంగాణ గురుకుల ప్రవేశాల అప్డేట్ - రిపోర్టింగ్ తేదీ, సమర్పించాల్సిన పత్రాలివే

TG Gurukul CET 2026 Admission Updates : తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో (TGCET-2026) ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవలనే రెండో విడత ఫలితాలు కూడా విడుదలయ్యాయి. ఎంపికైన విద్యార్థులు అడ్మిషన్ల సమయంలో ముఖ్యమైన ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

Published on: May 26, 2026, 11:02:55 IST
Advertisement

TG Gurukul CET 2026 Admissions : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, వెనుకబడిన తరగతుల (బీసీ) సంక్షేమ, సాధారణ గురుకుల విద్యాలయాల (TGSWREIS, TGTWREIS, MJPTBCWREIS, TREIS) లో ప్రవేశాలు జరుగుతున్నాయి. 5వ తరగతితో పాటు ఇతర తరగతుల బ్యాక్‌లాగ్ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

తెలంగాణ గురుకుల ప్రవేశాలు
తెలంగాణ గురుకుల ప్రవేశాలు

ఇప్పటికే TGCET-2026 మొదటి విడత ప్రవేశాలు పూర్తి కాగా… ఇటీవలనే రెండో విడత సీట్లను కూడా కేటాయించారు. ప్రవేశ పరీక్ష మెరిట్, రిజర్వేషన్లు, అభ్యర్థులు ఎంచుకున్న ప్రాధాన్యతల (ఆప్షన్స్) ఆధారంగా విద్యార్థులకు తాత్కాలికంగా సీట్లను కేటాయించారు. సీట్లు పొందిన విద్యార్థులంతా కూడా ఆయా స్కూళ్లకు వెళ్లి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

ప్రవేశ పరీక్షలో కేవలం సీటు సాధించినంత మాత్రాన అడ్మిషన్ ఖరారు కాదని… ఎంపికైన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా తమ ఒరిజినల్ ధృవీకరణ పత్రాలను సమర్పించి వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ సమర్పించిన పత్రాల్లో తప్పుడు సమాచారం ఉన్నట్లు తేలితే సదరు విద్యార్థి అడ్మిషన్ తక్షణమే రద్దవుతుంది.

సమర్పించాల్సిన పత్రాలు:

గురుకుల పాఠశాలల్లో ప్రవేశాల నిర్ధారణ కోసం తల్లిదండ్రులు, విద్యార్థులు కింది ఒరిజినల్ సర్టిఫికెట్లను, వాటి జిరాక్స్ కాపీలను సిద్ధం చేసుకొని సంబంధిత ప్రిన్సిపాల్‌కు సమర్పించాల్సి ఉంటుంది.

  • పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం: ప్రభుత్వం నుంచి జారీ అయ్యే అధికారిక బర్త్ సర్టిఫికెట్ నకలును సమర్పించాలి.
  • గత తరగతి బోనఫైడ్ సర్టిఫికెట్ : విద్యార్థి 2025-26 విద్యాసంవత్సరంలో పూర్తి కాలం చదివినట్లుగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జారీ చేసిన బోనఫైడ్ లేదా స్టడీ సర్టిఫికెట్.
  • ఆధార్ కార్డు (Aadhaar Card): విద్యార్థి ఆధార్ కార్డు తప్పనిసరిగా సమర్పించాలి.
  • కుల ధృవీకరణ పత్రం (: ఎస్సీ (SC), ఎస్టీ (ST), బీసీ (BC), మైనార్టీ (Minority) మరియు ఈడబ్ల్యూఎస్ (EWS) కేటగిరీల కింద సీటు పొందిన అభ్యర్థులు ప్రభుత్వం నుంచి పొందిన తాజా కుల ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.
  • తల్లిదండ్రుల ఆదాయ ధృవీకరణ పత్రం : నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతాల వారికి వార్షిక ఆదాయం రూ. 1,50,000 లోపు, పట్టణ ప్రాంతాల వారికి రూ. 2,000,000 లోపు ఉన్నట్లుగా తాజా ఇన్‌కమ్ సర్టిఫికెట్ అందించాలి.
  • వైద్య ఆరోగ్య ధృవీకరణ పత్రం (Medical Fitness Certificate): విద్యార్థి హాస్టల్ వసతితో కూడిన చదువుకు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు అర్హత గల వైద్యుడి నుంచి పొందిన ఫిట్‌నెస్ సర్టిఫికెట్.
  • దివ్యాంగుల ధృవీకరణ పత్రం : శారీరక వికలాంగుల (PHC) కోటా కింద ప్రవేశం పొందిన అభ్యర్థులు 40 శాతం కంటే తక్కువ కాకుండా జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ సంతకం చేసిన సదరమ్ లేదా మెడికల్ సర్టిఫికెట్ సమర్పించాలి.
  • టీసీ : పైన పేర్కొన్న అన్ని ధృవీకరణ పత్రాల వెరిఫికేషన్ విజయవంతంగా పూర్తయి…. సంబంధిత సొసైటీ ద్వారా సీటు ఖరారైనట్లు నిర్ధారణ పత్రం అందిన తర్వాత మాత్రమే పాత పాఠశాల నుంచి ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (TC) తీసుకొని గురుకులంలో సమర్పించాలి.

ఈ లింక్ పై క్లిక్ చేసి 5వ తరగతి రెండో విడత ఫలితాలు చెక్ చేసుకోవచ్చు

ఈ లింక్ పై క్లిక్ చేసి బ్యాక్ లాగ్ సీట్ల కేటాయింపు ఫలితాలను చెక్ చేసుకోవచ్చు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe