...
...
Next Story

తెలంగాణ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై హైకోర్టు కీలక తీర్పు

తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వం కేటాయించిన రిజర్వేషన్ల మీద హైకోర్టు తీర్పు వెలువరించింది. రిజర్వేషన్ల విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

Published on: Dec 4, 2025, 21:45:10 IST
Advertisement

పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల మీద తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన రిజర్వేషన్ల వ్యవహారంపై ఆరు పిటిషన్లు దాఖలు అయ్యాయి. అయితే దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. చట్ట ప్రకారం ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని వెల్లడించింది.

తెలంగాణ హైకోర్టు
తెలంగాణ హైకోర్టు

ఎస్సీ, ఎస్టీ జనాభా లేని ప్రాంతాల్లో సైతం ఆయా కులాలకు సర్పంచ్, వార్డు మెంబర్లుగా రిజర్వేషన్లు కేటాయించారని పిటిషన్ల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు తప్పుగా కేటాయించడం కారణంగా తప్పులు జరిగాయని వెల్లడించారు. అయితే రిజర్వేషన్లు కేటాయించిన ప్రదేశాల్లో సంబంధిత కులానికి చెందిన వ్యక్తులు లేకపోతే.. ఎన్నికలు నిర్వహించమని ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది. ఈ వాదనలను రికార్డు చేసుకున్న ధర్మాసనం.. విచారణను క్లోజ్ చేసింది.

తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ మెుదలైంది. 31 జిల్లాల్లోని 545 గ్రామీణ మండలాల్లోని 12,760 పంచాయతీలు, 1,13,534 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 11న తొలి విడత ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉండనుంది. అదేరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్, ఆ తర్వాత ఫలితాల ప్రకటన ఉంటుంది. ఒక దశకు మరో దశకు మధ్య రెండు రోజుల తేడా ఉంటుంది. మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. డిసెంబర్ 14, 17వ తేదీల్లో రెండు, మూడో దశ పోలింగ్ ఉంటుంది

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe