...
...
Next Story

TG ICET 2026 Counselling : టీజీ ఐసెట్ కౌన్సెలింగ్ అప్డేట్ - స్పాట్‌ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల, ముఖ్యమైన తేదీలు

TG ICET 2026 Spot Admissions : తెలంగాణలో ఐసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్ ప్రవేశాల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 31 నుంచి సెప్టెంబరు 3 వరకు సంబంధిత కళాశాలల్లో స్పాట్ ప్రవేశాలు నిర్వహిస్తారు.

Published on: Aug 25, 2026, 13:38:10 IST
Advertisement

TG ICET 2026 Counselling Spot Admissions : తెలంగాణలోని యూనివర్సిటీలు, వాటి పరిధిలోని అనుబంధ కళాశాలలు మరియు ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ విద్యాసంస్థల్లో ఎంబీఏ (MBA), ఎంసీఏ (MCA) కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి.

టీజీ ఐసెట్ కౌన్సెలింగ్ అప్డేట్
టీజీ ఐసెట్ కౌన్సెలింగ్ అప్డేట్

ఈ నెల 31వ తేదీ నుంచి సెప్టెంబరు 3వ తేదీ వరకు ఆయా కళాశాలల ప్రాంగణాల్లోనే నేరుగా ఈ స్పాట్ ప్రవేశాలను నిర్వహించనున్నారు. ప్రవేశాలు పొందే అభ్యర్థులు…. కళాశాలల ప్రిన్సిపాళ్లను నేరుగా సంప్రదించి అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

కళాశాలలు, బ్రాంచీలు, కేటగిరీల వారీగా మిగిలిపోయిన ఖాళీ సీట్ల పూర్తి వివరాలను 2026 ఆగస్టు 27న అధికారిక వెబ్‌సైట్‌ అయిన tgicet.nic.in లో అందుబాటులో ఉంచుతామని ప్రవేశాల కన్వీనర్ తెలిపారు. ఈ సమాచారాన్ని అదే రోజున ఆయా కళాశాలల నోటీస్ బోర్డులపై కూడా ప్రదర్శిస్తారు. అనంతరం ఆగస్టు 28న కళాశాలల యాజమాన్యాలు నోటిఫికేషన్ ఇస్తాయి. ఆగస్టు 29న దినపత్రికల్లో స్పాట్ అడ్మిషన్ల ప్రకటనలు ప్రచురితమవుతాయి.

టీజీ ఐసెట్ 2026 - స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ :

  • ఆగస్టు 27 : వెబ్‌సైట్ మరియు కళాశాల నోటీస్ బోర్డుల్లో ఖాళీ సీట్ల వివరాల ప్రదర్శన.
  • ఆగస్టు 28 : కళాశాలల ద్వారా స్పాట్ అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల.
  • ఆగస్టు 29 : వార్తాపత్రికల్లో ప్రకటనల ప్రచురణ.
  • ఆగస్టు 31 నుండి సెప్టెంబరు 3 వరకు : ఆయా కళాశాలల ప్రాంగణాల్లో స్పాట్ అడ్మిషన్ల నిర్వహణ.

ఐసెట్ అర్హత సాధించిన అభ్యర్థుల భర్తీ తర్వాత కూడా సీట్లు మిగిలిపోతే, ఐసెట్ రాయని లేదా అర్హత సాధించని విద్యార్థులకు కూడా అవకాశం కల్పిస్తారు. అయితే వీరు కూడా డిగ్రీలో నిర్దేశిత మార్కుల శాతాన్ని తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు లేదా అక్కడ చదివిన విద్యార్థులు ఈ స్పాట్ అడ్మిషన్లకు అనర్హులు. వేరే రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ పూర్తి చేసినవారు తెలంగాణలోని సంబంధిత యూనివర్సిటీ నుంచి ఈక్వివాలెన్సీ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది.

స్పాట్ అడ్మిషన్లలో పాల్గొనే విద్యార్థులు తప్పనిసరిగా ఒరిజినల్ సర్టిఫికేట్లతో నేరుగా కళాశాలల్లో హాజరుకావాల్సి ఉంటుంది. ఒరిజినల్స్ పరిశీలించిన అనంతరం వాటిని విద్యార్థులకు తిరిగి ఇచ్చేస్తారు. కళాశాలలో ఒరిజినల్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ తో పాటు ఒక సెట్ జిరాక్స్ ప్రతులను అందజేయాలి.

  • స్పాట్ అడ్మిషన్లలో ప్రవేశం పొందే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ సదుపాయం వర్తించదు.
  • టీజీ ఐసెట్-2026 అర్హత సాధించిన అభ్యర్థులకు: రూ. 1,300
  • టీజీ ఐసెట్-2026 అర్హత సాధించని అభ్యర్థులకు: రూ. 2,100
  • అధికారిక వెబ్ సైట్ - https://tgicet.nic.in/default.aspx

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe