తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2026 విడుదల అయ్యాయి. మెుత్తం 398459 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాస్ పర్సంటేజ్ 68.71 ఉండగా.. సెకండ్ ఇయర్ ఉత్తీర్ణత శాతం 47.70గా ఉంది. విద్యార్థులు https://tgbie.cgg.gov.in, https://results.cgg.gov.in వెబ్‌సైట్‌లలో ఫలితాలను చూసుకోవచ్చు. ఇక మార్కుల మెమోలు, రీకౌంటింగ్, పున:పరిశీలనపై ఇంటర్ బోర్డు అప్డేట్ ఇచ్చింది.
షార్ట్ మెమో

కళాశాల ప్రిన్సిపాల్‌లు తమ లాగిన్ ద్వారా విద్యార్థుల 'ఆన్‌లైన్ మార్కుల మెమోరాండం' (షార్ట్ మెమో)ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే సాయంత్రం 5:00 గంటల నుండి కళాశాల మార్కుల రిజిస్టర్లను (ట్యాబులేషన్ రిజిస్టర్లు) కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు బోర్డు వెబ్‌సైట్ (https://tgbie.cgg.gov.in) నుండి సాయంత్రం 5:00 గంటల తర్వాత 'ఆన్‌లైన్ మార్కుల మెమోరాండం' (షార్ట్ మెమో)ను డౌన్‌లోడ్ చేసుకుని, దాని కలర్ ప్రింటవుట్ తీసుకోవాలని సూచించింది బోర్డు.
ఇంకా మార్కుల మెమోరాండం ఫిజికల్ కాపీ ప్రత్యేకంగా పంపిణీ చేయరని విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రిన్సిపాల్‌లకు తెలియజేస్తున్నట్టుగా బోర్డు పేర్కొంది. బోర్డు నుండి (మార్కులతో కూడిన) ఉత్తీర్ణత ధృవీకరణ పత్రం అందే వరకు విద్యార్థులు దీనిని డౌన్‌లోడ్ చేసుకుని తమ వద్ద భద్రపరచుకోవాలి.
తప్పులు ఉంటే ఇలా సరిచేసుకోండి
ఆన్‌లైన్ మార్కుల మెమోరాండంలో ఏవైనా లోపాలు లేదా తేడాలు ఉంటే, ఫలితాలు వెలువడిన పది రోజులలోపు సంబంధిత ప్రిన్సిపాల్‌ల ద్వారా బోర్డు దృష్టికి తీసుకురావాలి లేదా helpdesk-ie@telangana.gov.in అనే ఈమెయిల్ చిరునామాకు పంపాలి. ఈ గడువు తర్వాత వచ్చే దరఖాస్తులు స్వీకరించరు.
రీకౌంటింగ్, పున:పరిశీలన
జవాబు పత్రాల రీకౌంటింగ్, స్కాన్ చేసిన ప్రతిని అందించడం, పునఃపరిశీలన కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్ లేదా పునఃపరిశీలన, స్కాన్ చేసిన కాపీ కోసం దరఖాస్తు చేయాలనుకునే విద్యార్థులు, BIE వెబ్‌సైట్ (https://tgbie.cgg.gov.in) లోని 'Student Online Services' ద్వారా ఆన్‌లైన్‌లో నిర్ణీత రుసుమును చెల్లించాలి.
రీకౌంటింగ్ కోసం ఒక్కో పేపర్‌కు రూ. 100 చెల్లించాలి. జవాబు పత్రం స్కాన్ చేసిన కాపీ, పునఃపరిశీలన కోసం ఒక్కో పేపర్‌కు రూ. 800 చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుసుమును 12-06-2026 నుండి 18-06-2026 వరకు చెల్లించవచ్చు. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత ఈ ఆన్‌లైన్ సేవ నిలిపివేస్తారు. గడువు పొడిగింపు ఉండదు. గడువు ముగిసిన తర్వాత మాన్యువల్ (నేరుగా) దరఖాస్తులను సమర్పించడం ఏ పరిస్థితుల్లోనూ అనుమతించరు. రీకౌంటింగ్ లేదా స్కాన్ చేసిన కాపీ, పునఃపరిశీలన కోసం చెల్లించిన రుసుము తిరిగి ఇవ్వరు.
{{/usCountry}}రీకౌంటింగ్ కోసం ఒక్కో పేపర్‌కు రూ. 100 చెల్లించాలి. జవాబు పత్రం స్కాన్ చేసిన కాపీ, పునఃపరిశీలన కోసం ఒక్కో పేపర్‌కు రూ. 800 చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుసుమును 12-06-2026 నుండి 18-06-2026 వరకు చెల్లించవచ్చు. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత ఈ ఆన్‌లైన్ సేవ నిలిపివేస్తారు. గడువు పొడిగింపు ఉండదు. గడువు ముగిసిన తర్వాత మాన్యువల్ (నేరుగా) దరఖాస్తులను సమర్పించడం ఏ పరిస్థితుల్లోనూ అనుమతించరు. రీకౌంటింగ్ లేదా స్కాన్ చేసిన కాపీ, పునఃపరిశీలన కోసం చెల్లించిన రుసుము తిరిగి ఇవ్వరు.
{{/usCountry}}విద్యార్థి రీకౌంటింగ్ లేదా స్కాన్ చేసిన కాపీ, పునఃపరిశీలన కోసం దరఖాస్తు చేయాలనుకుంటున్న నిర్దిష్ట సబ్జెక్టు(ల)ను ఎంచుకోవాలి. వారి పూర్తి చిరునామా, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌ను తప్పనిసరిగా నమోదు చేయాలి. అభ్యర్థులు తమ సొంత జవాబు పత్రం కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇతర అభ్యర్థుల స్కాన్ చేసిన కాపీని పొందడం నేరమని ఇంటర్ బోర్డు హెచ్చరించింది. బోర్డు వీలైనంత త్వరగా రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్ నిర్వహించడానికి వీలుగా, అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.