TG LAWCET Counseling : తెలంగాణలో మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సులు , అలాగే ఎల్‌ఎల్‌ఎమ్ (LLM) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. టీజీ లాసెట్ (TG LAWCET 2026) మొదటి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. అర్హత సాధించిన అభ్యర్థులు తమకు ఇష్టమైన కళాశాలలను ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఈనెల 31 వరకు వెబ్ ఆప్షన్లు…

మరోవైపు కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా నేటితోనే రిజిస్ట్రేషన్ గడువు కూడా ముగియనుంది. కాబట్టి అభ్యర్థులు…. ఆన్‌లైన్ విధానంలో తమ ప్రాథమిక వివరాలను నమోదు చేసుకోవడంతో పాటు, అవసరమైన విద్యార్హత, కుల, ఆదాయ తదితర ధృవీకరణ పత్రాలను అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన అభ్యర్థులు జూలై 31 వరకు తమ వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు https://lawcetadm.tgche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల అప్‌లోడ్ : జూలై 28 వరకు అవకాశం ఉంటుంది.
- మొదటి విడత వెబ్ ఆప్షన్లు : జూలై 28 నుంచి జూలై 31 వరకు చేసుకోవచ్చు.
- వెబ్ ఆప్షన్ల ఎడిట్ : నమోదు చేసుకున్న ఆప్షన్లలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఆగస్టు 1వ తేదీన అవకాశం కల్పిస్తారు.
- మొదటి విడత సీట్ల కేటాయింపు : అభ్యర్థుల మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా ఆగస్టు 5న అధికారిక వెబ్‌సైట్‌లో సీట్ల కేటాయింపు వివరాలను వెల్లడిస్తారు.
- కళాశాలల్లో రిపోర్టింగ్ : సీటు పొందిన విద్యార్థులు ఆగస్టు 6 నుంచి ఆగస్టు 10వ తేదీ మధ్యలో సంబంధిత కళాశాలల్లో నేరుగా హాజరై సర్టిఫికెట్లు సమర్పించి ప్రవేశం పొందాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ - https://lawcetadm.tgche.ac.in/
టీజీ లాసెట్ 2026 ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి అర్హత పొందిన విద్యార్థులందరూ ఈ కౌన్సెలింగ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. కౌన్సెలింగ్, వెబ్ ఆప్షన్ల నమోదు లేదా సర్టిఫికేట్ల అప్లోడ్లో ఎలాంటి సాంకేతిక సమస్యలు ఎదురైనా, సందేహాలు ఉన్నా అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అభ్యర్థులు తమ సమస్యలను అధికారిక ఈ-మెయిల్ tgcetsadmissions2026@gmail.com ద్వారా సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చని సూచించారు.
{{/usCountry}}టీజీ లాసెట్ 2026 ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి అర్హత పొందిన విద్యార్థులందరూ ఈ కౌన్సెలింగ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. కౌన్సెలింగ్, వెబ్ ఆప్షన్ల నమోదు లేదా సర్టిఫికేట్ల అప్లోడ్లో ఎలాంటి సాంకేతిక సమస్యలు ఎదురైనా, సందేహాలు ఉన్నా అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అభ్యర్థులు తమ సమస్యలను అధికారిక ఈ-మెయిల్ tgcetsadmissions2026@gmail.com ద్వారా సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చని సూచించారు.
{{/usCountry}}