TG LAWCET Counseling 2026 : టీజీ లాసెట్ కౌన్సెలింగ్ అప్డేట్ - నేటి నుంచే వెబ్ ఆప్షన్లు, ఆగస్టులో సీట్ల కేటాయింపు

TG LAWCET Counseling : టీజీ లాసెట్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. అయితే కీలకమైన వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. అర్హులైన అభ్యర్థులు… కాలేజీలను ఎంచుకోవాల్సి ఉంటుంది. 

Published on: Jul 28, 2026, 10:48:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

TG LAWCET Counseling : తెలంగాణలో మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సులు , అలాగే ఎల్‌ఎల్‌ఎమ్ (LLM) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. టీజీ లాసెట్ (TG LAWCET 2026) మొదటి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. అర్హత సాధించిన అభ్యర్థులు తమకు ఇష్టమైన కళాశాలలను ఎంచుకోవాల్సి ఉంటుంది.

టీజీ లాసెట్ కౌన్సెలింగ్ 2026  - వెబ్ ఆప్షన్లు
టీజీ లాసెట్ కౌన్సెలింగ్ 2026 - వెబ్ ఆప్షన్లు

ఈనెల 31 వరకు వెబ్ ఆప్షన్లు…

మరోవైపు కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా నేటితోనే రిజిస్ట్రేషన్ గడువు కూడా ముగియనుంది. కాబట్టి అభ్యర్థులు…. ఆన్‌లైన్ విధానంలో తమ ప్రాథమిక వివరాలను నమోదు చేసుకోవడంతో పాటు, అవసరమైన విద్యార్హత, కుల, ఆదాయ తదితర ధృవీకరణ పత్రాలను అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన అభ్యర్థులు జూలై 31 వరకు తమ వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు https://lawcetadm.tgche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల అప్‌లోడ్ : జూలై 28 వరకు అవకాశం ఉంటుంది.
  • మొదటి విడత వెబ్ ఆప్షన్లు : జూలై 28 నుంచి జూలై 31 వరకు చేసుకోవచ్చు.
  • వెబ్ ఆప్షన్ల ఎడిట్ : నమోదు చేసుకున్న ఆప్షన్లలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఆగస్టు 1వ తేదీన అవకాశం కల్పిస్తారు.
  • మొదటి విడత సీట్ల కేటాయింపు : అభ్యర్థుల మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా ఆగస్టు 5న అధికారిక వెబ్‌సైట్‌లో సీట్ల కేటాయింపు వివరాలను వెల్లడిస్తారు.
  • కళాశాలల్లో రిపోర్టింగ్ : సీటు పొందిన విద్యార్థులు ఆగస్టు 6 నుంచి ఆగస్టు 10వ తేదీ మధ్యలో సంబంధిత కళాశాలల్లో నేరుగా హాజరై సర్టిఫికెట్లు సమర్పించి ప్రవేశం పొందాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ - https://lawcetadm.tgche.ac.in/

టీజీ లాసెట్ 2026 ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి అర్హత పొందిన విద్యార్థులందరూ ఈ కౌన్సెలింగ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. కౌన్సెలింగ్, వెబ్ ఆప్షన్ల నమోదు లేదా సర్టిఫికేట్ల అప్‌లోడ్‌లో ఎలాంటి సాంకేతిక సమస్యలు ఎదురైనా, సందేహాలు ఉన్నా అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అభ్యర్థులు తమ సమస్యలను అధికారిక ఈ-మెయిల్ tgcetsadmissions2026@gmail.com ద్వారా సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చని సూచించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More