...
...
Next Story

TG LAWCET 2026 Counselling : టీజీ లాసెట్ కౌన్సెలింగ్ గడువు పొడిగింపు - తాజా షెడ్యూల్ ఇదే..!

TG LAWCET 2026 Counselling : తెలంగాణలో ఎల్‌ఎల్‌బీ మూడేళ్లు, ఐదేళ్ల కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ లాసెట్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువును అధికారులు పొడిగించారు. అభ్యర్థులు జూలై 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: Jul 10, 2026, 18:52:02 IST
Advertisement

TG LAWCET 2026 Counselling : తెలంగాణలో లా కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు మరో ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. ఎల్‌ఎల్‌బీ (3 YDC), ఎల్‌ఎల్‌బీ (5 YDC) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న టీజీ లాసెట్ 2026 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ల అప్‌లోడ్ గడువును పొడిగించారు. ఈ మేరకు కన్వీనర్ ప్రొఫెసర్ ఐ. పాండురంగా రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు.

ఈనెల 20 వరకు గడువు పొడిగింపు…

టీజీ లాసెట్ కౌన్సెలింగ్ గడువు పొడిగింపు
టీజీ లాసెట్ కౌన్సెలింగ్ గడువు పొడిగింపు

అర్హులైన అభ్యర్థులు జూలై 20 (సోమవారం) వరకు ఆన్‌లైన్ విధానంలో తమ వివరాలను నమోదు చేసుకోవడంతో పాటు అవసరమైన ధృవీకరణ పత్రాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయవచ్చు. గతంలో ఇచ్చిన గడువు ముగియడంతో, విద్యార్థుల అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కన్వీనర్ కార్యాలయం స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ అంతా కూడా ఈ పొడిగించిన గడువు లోపే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

షెడ్యూల్ లో మార్పులు - వివరాలు:

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ల అప్‌లోడింగ్: జూలై 20, 2026 వరకు పొడిగింపు
  • అర్హులైన అభ్యర్థుల జాబితా ప్రదర్శన, ఈ-మెయిల్ ద్వారా సవరణల స్వీకరణ: జూలై 22, 2026
  • మొదటి విడత వెబ్ ఆప్షన్ల నమోదు : జూలై 23 నుంచి జూలై 26, 2026 వరకు అవకాశం.
  • వెబ్ ఆప్షన్ల సవరణ (ఎడిట్ ఆప్షన్): జూలై 27, 2026
  • మొదటి విడత తాత్కాలిక సీట్ల కేటాయింపు (కళాశాలల వారీగా): జూలై 30, 2026.
  • ఒరిజినల్ సర్టిఫికేట్ల పరిశీలన కోసం సంబంధిత కళాశాలల్లో రిపోర్టింగ్: జూలై 31 నుండి ఆగస్టు 03, 2026 వరకు.

టీజీ లాసెట్ - 2026లో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా సందేహాలు ఉంటే అధికారిక ఈ-మెయిల్ (tgcetsadmissions2026@gmail.com) ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు.

అభ్యర్థులు సాధించిన ర్యాంకులతో పాటు వారి రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందే వాళ్లు… నిర్దేశించిన తేదీలలోపే రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అలా చేయకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు. ఇక గడిచిన కొంతకాలంగా లా కోర్సుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీంతో ఈ సీట్లకు తెగ డిమాండ్ ఉంటోంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe