NEET PG 2026 : నీట్ పీజీ 2026- రిజిస్ట్రేషన్ డెడ్‌లైన్ నుంచి అప్లికేషన్ ఫీజు వరకు..
NEET PG 2026 registration : వైద్య విద్యలో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే 'నీట్ పీజీ 2026' నోటిఫికేషన్‌ను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జులై 28 లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా, డీఎన్‌బీ, డాక్టర్ ఎన్‌బీ కోర్సుల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాలు కల్పించేందుకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా జులై 28 వరకు తమ అప్లికేషన్లను సమర్పించవచ్చు. ఈసారి ప్రవేశ పరీక్షను ఎలాంటి గందరగోళం లేకుండా ఆగస్టు 30వ తేదీన దేశవ్యాప్తంగా ఒకే షిఫ్ట్‌లో నిర్వహించనున్నారు. పరీక్ష ముగిసిన అనంతరం సెప్టెంబర్ 30లోగా నీట్ పీజీ 2026 ఫలితాలను విడుదల చేస్తారు.

నీట్ పీజీ 2026- ముఖ్యమైన తేదీలు..
మెడికల్ విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సిన నీట్ పీజీ 2026 ముఖ్యమైన షెడ్యూల్ వివరాలు..
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరి తేదీ: జులై 28, 2026
ఇమేజ్ కరెక్షన్ విండో (ఫోటో మార్పుల కోసం): జులై 31 నుంచి ఆగస్టు 10, 2026
పరీక్షా కేంద్రాల నగరాల జాబితా : ఆగస్టు 11, 2026
అడ్మిట్ కార్డ్ (హాల్ టికెట్) విడుదల: ఆగస్టు 27, 2026
నీట్ పీజీ పరీక్ష తేదీ: ఆగస్టు 30, 2026
ఫలితాల ప్రకటన: సెప్టెంబర్ 30, 2026 లోపు
నీట్ పీజీ 2026- అర్హత ప్రమాణాలు..
అభ్యర్థులు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) చట్టం-2019, పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్-2023 నిబంధనల ప్రకారం గుర్తింపు పొందిన ఎంబీబీఎస్ డిగ్రీ లేదా ప్రొవిజనల్ ఎంబీబీఎస్ పాస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
అభ్యర్థులు తమ ఒక సంవత్సరం తప్పనిసరి ఇంటర్న్షిప్ని సెప్టెంబర్ 30, 2026 నాటికి లేదా అంతకంటే ముందే పూర్తి చేసి ఉండాలి.
నీట్ పీజీ 2026- అప్లికేషన్ ఫీజు..
అభ్యర్థులు కేవలం ఎన్‌బీఈఎమ్‌ఎస్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు: రూ. 3,500
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల అభ్యర్థులకు: రూ. 2,500
గమనిక: ఒకసారి చెల్లించిన అప్లికేషన్ ఫీజును ఎట్టి పరిస్థితుల్లోనూ రీఫండ్ చేయరని, అలాగే అప్లికేషన్‌ను వెనక్కి తీసుకునే అవకాశం ఉండదని బోర్డు స్పష్టం చేసింది.
నీట్ పీజీ 2026- ఎగ్జామ్ ప్యాటర్న్, నెగెటివ్ మార్కింగ్..
నీట్ పీజీ 2026 పరీక్ష కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. మొత్తం 180 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష రాయడానికి 3 గంటల 30 నిమిషాల సమయం కేటాయించారు.
సరైన సమాధానానికి: +4 మార్కులు లభిస్తాయి.
తప్పు సమాధానానికి: -1 మార్కు కట్ అవుతుంది (నెగెటివ్ మార్కింగ్ ఉంది).
సమాధానం రాయకపోతే: 0 మార్కులు.
పరీక్ష సమయంలో అభ్యర్థులు ప్రశ్నలను ‘మార్క్ ఫర్ రివ్యూ’ చేసుకునే సౌకర్యం ఉంది. వీటిని కూడా ప్రధాన మార్కింగ్ విధానం ప్రకారమే మూల్యాంకనం చేస్తారు.
నీట్ పీజీ 2026- అభ్యర్థులకు బోర్డు కీలక హెచ్చరిక..
దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు ఇన్ఫర్మేషన్ బులెటిన్‌ను పూర్తిగా చదవాలని అధికారులు సూచించారు. అలాగే తమ వ్యక్తిగత సమాచారం, లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్, ఓటీపీ, హాల్ టికెట్లు లేదా స్కోర్‌కార్డులను ఎలాంటి థర్డ్ పార్టీ ఏజెన్సీలతో లేదా అపరిచిత వ్యక్తులతో పంచుకోవద్దని అభ్యర్థులను హెచ్చరించారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


