రాష్ట్రంలోని న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ లాసెట్ - 2026 కు సంబంధించి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి.ఇంటర్ విద్యార్హతతో 5 ఏళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు, డిగ్రీ విద్యార్హతపై మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌బీ పూర్తయిన వారికి రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫైన్ తో అయితే మే 13వ తేదీ వరకు అవకాశం ఉంది.

టీజీ లాసెట్ - 2026 నోటిఫికేషన్ లో భాగంగా 2026- 2027 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది కూడా ఈ ప్రవేశ పరీక్ష బాధ్యతలను ఉస్మానియా యూనివర్శిటీ చూస్తోంది.
టీజీ లాసెట్ - 2026కు ఎలాంటి ఫైన్ లేకుండా ఏప్రిల్ 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 13వ తేదీ వరకు ఫైన్ తో దరఖాస్తుకు అవకాశం కల్పించారు. అప్లికేషన్ ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 900, జనరల్ అభ్యర్థులు రూ. 1100 చెల్లించాలి. పీజీఎల్ సెట్ కు దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్ఖులు రూ. 900, జనరల్ అభ్యర్థులు రూ. 1100 చెల్లించాలి.
టీజీ లాసెట్ అప్లికేషన్ ప్రాసెస్
- ముందుగా https://lawcet.tgche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలోని అప్లికేషన్ ఫీజు చెల్లింపు ఆప్షన్ పై నొక్కి ఫీజు చెల్లించాలి.
- ఆ తర్వాత అప్లికేషన్ ఫారమ్ లింక్ పై నొక్కాలి. ఇక్కడ పేమెంట్ ఐడీ, హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీని ఎంట్రీ చేయాలి.
- సబ్మిట్ చేసిన తర్వాత దరఖాస్తు ఫారమ్ ఓపెన్ అవుతుంది.
- మీ వివరాలను ఎంట్రీ చేయటంతో పాటు అభ్యర్థి ఫొటో, సంతకం అప్ లోడ్ చేయాలి.
- చివరగా సబ్మిట్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ కాపీని పొందొచ్చు.
మే 18న ఎంట్రెన్స్ ఎగ్జామ్…
మే 18వ తేదీన మూడేళ్ల ఎల్ఎల్ బీ ఎంట్రెన్స్ పరీక్ష ఉంటుంది. ఉదయం 09. 30 గంటల నుంచి 11 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మరో సెషన్ ఉంటుంది. ఇక ఎల్ఎల్ బీ ఐదేళ్ల కోర్సుతో పాటు ఎల్‌ఎల్‌ఎం ఎంట్రెన్స్ పరీక్షను సాయంత్రం 4 గంటల నుంచి 05.30 గంటల మధ్య నిర్వహిస్తారు.
{{/usCountry}}మే 18వ తేదీన మూడేళ్ల ఎల్ఎల్ బీ ఎంట్రెన్స్ పరీక్ష ఉంటుంది. ఉదయం 09. 30 గంటల నుంచి 11 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మరో సెషన్ ఉంటుంది. ఇక ఎల్ఎల్ బీ ఐదేళ్ల కోర్సుతో పాటు ఎల్‌ఎల్‌ఎం ఎంట్రెన్స్ పరీక్షను సాయంత్రం 4 గంటల నుంచి 05.30 గంటల మధ్య నిర్వహిస్తారు.
{{/usCountry}}టీజీ లాసెట్ ప్రాథమిక కీ మే 23వ తేదీన అందుబాటులోకి వస్తాయి. వీటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే మే 25వ తేదీ వరకు స్వీకరిస్తారు. జూన్ 5వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు.
టీజీ లాసెట్ పరీక్షను మొత్తం 120 మార్కులకు నిర్వహిస్తారు. ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. విడతల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టి సీట్లను భర్తీ చేస్తారు. కౌన్సెలింగ్ పూర్తి అయిన తర్వాత కూడా సీట్లు మిగిలితే స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలను ప్రకటిస్తారు. గత కొంతకాలంగా లా కోర్సులకు మంచి డిమాండ్ ఉంటోంది. సీట్ల కోసం చాలా మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
టీజీ లాసెట్ 2026 : ముఖ్యమైన తేదీలు
- టీజీ లాసెట్ ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ - 1 ఏప్రిల్ 2026.
- రూ. 500 ఫైన్ తో దరఖాస్తులకు చివరి తేదీ - 15-04-2026.
- రూ.1000 ఫైన్ తో చివరి తేదీ - 25-04-2026.
- రూ. 2000 ఫైన్ తో అప్లికేషన్లకు చివరి తేదీ - 05-05-2026.
- రూ.4000 ఫైన్ తో దరఖాస్తులకు చివరి తేదీ - 10-.05-2026.
- రూ.10000 ఆలస్య రుసుంతో చివరి తేదీ - 13-05-2026
- అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ - 03-05-2026 నుంచి 08-05-2026.
- హాల్ టికెట్ డౌన్లోడ్ - 12-05-2026
- పరీక్ష తేదీ - 18-05-2026
- ప్రాథమి కీలు విడుదల - 23-05-2026
- అభ్యంతరాల స్వీకరణ - 25-05-2026
- ఫలితాలు ప్రకటించే తేదీ - 05-06-2026
- అధికారిక వెబ్ సైట్ - https://lawcet.tgche.ac.in/