TG LAWCET Phase 2 Counselling : తెలంగాణలోని న్యాయ కళాశాలల్లో మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ లాసెట్ (TG LAWCET) అడ్మిషన్ల రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనని లేదా రిజిస్ట్రేషన్ చేసుకోని అభ్యర్థులకు ఇది ఒక చక్కని అవకాశం అని ప్రవేశాల కన్వీనర్ పాండురంగారెడ్డి తెలిపారు.

న్యాయవిద్య అభ్యసించాలనుకునే అర్హులైన విద్యార్థులు నిర్ణీత గడువులోగా తమ ఆన్‌లైన్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచించారు. మొదటి దశలో రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయిన అభ్యర్థులు ఆన్‌లైన్ ఫీజు చెల్లింపుతో పాటు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
అభ్యర్థులు సమర్పించిన సర్టిఫికెట్లను అధికారులు పరిశీలించిన అనంతరం…. అర్హులైన అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. దరఖాస్తుల్లో లేదా వివరాల్లో ఏవైనా సవరణలు ఉంటే ఈమెయిల్ సర్వీస్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. దీని ఆధారంగా వెబ్ ఆప్షన్లు ఎంచుకోవడానికి అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు.
వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత, అభ్యర్థులు తాము ఎంచుకున్న ప్రాధాన్యతల ఆధారంగా ఆప్షన్లలో మార్పులు లేదా చేర్పులు (Edit) చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. అభ్యర్థుల మెరిట్, రిజర్వేషన్ మరియు వెబ్ ఆప్షన్ల ఆధారంగా కాలేజీల వారీగా తాత్కాలికంగా ఎంపికైన వారి జాబితాను రూపొందించి అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు.
సీటు పొందిన అభ్యర్థులు తమకు కేటాయించిన కళాశాలల్లో నేరుగా నివేదించాల్సి ఉంటుంది . ఈ సమయంలో విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ట్యూషన్ ఫీజు చెల్లించిన రశీదును తప్పనిసరిగా సంబంధిత కాలేజీ అధికారులకు సమర్పించి అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీల వివరాలు:
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ల అప్‌లోడ్ (మొదటి విడతలో నమోదు చేసుకోని వారికి) : ఆగస్టు 19 నుంచి ఆగస్టు 22 వరకు
- పరిశీలించిన అర్హుల జాబితా ప్రదర్శన, సవరణలకు అవకాశం : ఆగస్టు 23
- వెబ్ ఆప్షన్ల నమోదు: ఆగస్టు 23 నుంచి ఆగస్టు 25 వరకు
- వెబ్ ఆప్షన్ల ఎడిట్ (సవరణ) అవకాశం : ఆగస్టు 26
- కళాశాలల వారీగా ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రదర్శన : ఆగస్టు 29
- సంబంధిత కాలేజీల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఫీజు రశీదుతో రిపోర్టింగ్ : ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 5 వరకు
లా కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు గడువు తేదీలను గమనించి, ఆన్‌లైన్ ప్రక్రియను మరియు కాలేజ్ రిపోర్టింగ్‌ను సకాలంలో పూర్తి చేసుకోవాలని అడ్మిషన్ల కన్వీనర్ స్పష్టం చేశారు. https://lawcetadm.tgche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అర్హులైన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ తో పాటు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు.
{{/usCountry}}లా కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు గడువు తేదీలను గమనించి, ఆన్‌లైన్ ప్రక్రియను మరియు కాలేజ్ రిపోర్టింగ్‌ను సకాలంలో పూర్తి చేసుకోవాలని అడ్మిషన్ల కన్వీనర్ స్పష్టం చేశారు. https://lawcetadm.tgche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అర్హులైన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ తో పాటు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు.
{{/usCountry}}