...
...
Next Story

TG LAWCET Phase 1 : టీజీ లాసెట్ ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్ ఫలితాలు విడుదల

TG LAWCET Phase 1 Seat Allotment : టీజీ లాసెట్ ఫేజ్ 1 సీట్ కేటాయింపు ఫలితాలు విడుదల అయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలు చూసుకోవచ్చు.

Published on: Aug 5, 2026, 19:42:34 IST
Advertisement

టీజీ లాసెట్ ఫేజ్ 1 సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదల అయ్యాయి. LL.B. 3YDC, 5YDC కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి.. అభ్యర్థులు తమకు కేటాయించిన కాలేజీని అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. https://lawcetadm.tgche.ac.in/లో ఫలితాలు చూడవచ్చు.

ఫలితాలు ఎలా చూడాలి?

టీజీ లాసెట్ ఫలితాలు విడుదల
టీజీ లాసెట్ ఫలితాలు విడుదల

https://lawcetadm.tgche.ac.in/ అధికారిక వెబ్‌సైట్ వెళ్లండి.

Candidate Allotment Login Phase I మీద క్లిక్ చేయాలి.

హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్, మెుబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి.

తర్వాత పాస్‌వర్డ్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

ఫలితాలు స్క్రీన్ పై కనిపిస్తాయి. మీ సీటు అలాట్‌మెంట్ అయిన కాలేజీ కనిపిస్తుంది. మీరు ఇక్కడ నుంచి మీ కోర్సు ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ట్యూషన్ ఫీజు ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి. 'pay fee' బటన్‌పై క్లిక్ చేయండి. మీరు పేమెంట్ గేట్‌వేకి వెళ్తారు. ఎంచుకున్న చెల్లింపు విధానం ప్రకారం వివరాలను సరిగ్గా నమోదు చేసి, చెల్లింపు చేయండి. అక్నాలెడ్జ్‌మెంట్ రసీదు, జాయినింగ్ రిపోర్ట్ ప్రింటౌట్ తీసుకోండి.

అభ్యర్థులు / తల్లిదండ్రులు తమ సొంత బ్యాంక్ ఖాతాల నుండి ట్యూషన్ ఫీజు చెల్లించాలి. ఎందుకంటే.. ఒకవేళ రీఫండ్‌లు ఏవైనా ఉంటే చెల్లింపు చేసిన అదే బ్యాంక్ ఖాతాలోకి ఆ మొత్తం ఆన్‌లైన్ ద్వారా తిరిగి పంపుతారు. అభ్యర్థులు / తల్లిదండ్రులు ట్యూషన్ ఫీజు చెల్లింపు చేసే ముందు క్రెడిట్ కార్డ్ / డెబిట్ కార్డ్ / నెట్ బ్యాంకింగ్ మొత్తం పరిమితిని సరిచూసుకోవాలి.

కేటాయించిన కళాశాలలో అన్ని అసలు సర్టిఫికేట్లను సమర్పించకపోతే సీటు కేటాయింపు రద్దు అవుతుంది. 06 ఆగస్టు, 2026 నుండి 12 ఆగస్టు, 2026 మధ్య కేటాయించిన కళాశాలకు హాజరు కావాలి.

ఈ లింక్ మీద క్లిక్ చేసి.. మీకు అలాట్ అయిన కాలేజీలోని ఇతర అభ్యర్థుల పేర్లు చూడండి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe