TG POLYCET 1st Phase Counselling 2026 : రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన 'టీజీ పాలిసెట్-2026' (TG POLYCET) మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించి విద్యార్థులకు సాంకేతిక విద్యాశాఖ ముఖ్యమైన సమాచారం అందించింది. మొదటి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా వివిధ పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్లు పొందిన అభ్యర్థుల ఆన్‌లైన్ రిపోర్టింగ్ , ట్యూషన్ ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది.
ఈనెల 11 వరకు పొడిగింపు

విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మొదటి విడతలో సీట్లు పొందిన అర్హులైన విద్యార్థులు ఈ నెల 11వ తేదీ (జూన్ 11) వరకు తమ ట్యూషన్ ఫీజును ఆన్‌లైన్ ద్వారా చెల్లించడంతో పాటు సంబంధిత వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
నిర్ణీత గడువులోగా ఫీజు చెల్లించి… ఆన్‌లైన్ రిపోర్టింగ్ చేయని అభ్యర్థుల సీట్లు ఆటోమేటిక్‌గా రద్దవుతాయి. ఆ ఖాళీలను తదుపరి విడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తారని అధికారులు స్పష్టం చేశారు. అందువల్ల విద్యార్థులు ఈ పొడిగించిన గడువును సద్వినియోగం చేసుకుని తమ సీట్లను ఖరారు చేసుకోవాలని సూచిస్తున్నారు.
టీజీ పాలిసెట్ సీట్లు - అలాట్ మెంట్ డౌన్లోడ్ ఇలా:
- ముందుగా https://tgpolycet.nic.in/default.aspx వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలోని క్యాండెట్ లాగిన్ పై క్లిక్ చేయాలి.
- మీ వివరాలతో లాగిన్ అయిన తర్వాత… అలాట్ మెంట్ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది.
- దీనిపై క్లిక్ చేస్తే మీ అలాట్ మెంట్ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా ఈ కాపీని పొందొచ్చు.
- కాలేజీలో రిపోర్టింగ్ చేయాలంటే అలాట్ మెంట్ అర్డర్ కాపీని తప్పనిసరిగా ఉండాలి.
టీజీ పాలిసెట్ మొదటి విడత సీట్ల భర్తీ ప్రక్రియ ముగిసిన తర్వాత మిగిలిపోయిన సీట్ల కోసం చివరి విడత (ఫైనల్ ఫేజ్) కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఈ చివరి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 15న ప్రారంభమై… జూన్ 22వ తేదీతో ముగుస్తుంది.
{{/usCountry}}టీజీ పాలిసెట్ మొదటి విడత సీట్ల భర్తీ ప్రక్రియ ముగిసిన తర్వాత మిగిలిపోయిన సీట్ల కోసం చివరి విడత (ఫైనల్ ఫేజ్) కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఈ చివరి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 15న ప్రారంభమై… జూన్ 22వ తేదీతో ముగుస్తుంది.
{{/usCountry}}కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా విద్యార్థులకు తమ బ్రాంచ్‌లను మార్చుకునేందుకు అధికారులు ఇంటర్నల్ స్లైడింగ్ అవకాశం కల్పించారు. జూన్ 27 నుంచి జూన్ 30 వరకు ఈ ప్రక్రియ అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా విద్యార్థులు తాము చేరిన కళాశాలలోనే ఒక కోర్సు నుంచి మరో కోర్సులోకి (ఉదాహరణకు మెకానికల్ బ్రాంచ్ నుంచి కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌కు) మారడానికి వీలుంటుంది.
ఇక ఈ ప్రధాన ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత కూడా ఏవైనా సీట్లు మిగిలిపోతే…. వాటిని భర్తీ చేయడానికి జూలై 1 నుంచి జూలై 8వ తేదీల మధ్య స్పాట్ ప్రవేశాలు ) నిర్వహించాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది.