...
...
Next Story

TG POLYCET 2026 : తెలంగాణ పాలిసెట్ దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ - వెంటనే అప్లయ్ చేసుకోండి

TG POLYCET Application 2026 : టీజీ పాలిసెట్-2026 దరఖాస్తు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఎటువంటి అదనపు రుసుము లేకుండా ఇవాళ్టితో దరఖాస్తు గడువు ముగుస్తుంది.

Published on: Apr 20, 2026, 09:06:36 IST
Advertisement

Telangana Polytechnic Entrance Exam 2026 : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు టీజీ పాలిసెట్ నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ చివరి దశకు చేరింది.

తెలంగాణ పాలిసెట్ 2026 దరఖాస్తులు
తెలంగాణ పాలిసెట్ 2026 దరఖాస్తులు

స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునే గడువు నేటితో పూర్తవుతుంది. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు లేదా ప్రస్తుతం పరీక్షలు రాస్తున్న వారు ఈ ప్రవేశ పరీక్షకు అర్హులు.

ఇంజినీరింగ్, నాన్-ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటు అగ్రికల్చర్, వెటర్నరీ కోర్సుల్లో చేరాలనుకునే వారు ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. జనరల్ విద్యార్థులు రూ. 500 ఫీజు చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అయితే రూ. 250గా నిర్ణయించారు. గడువు దాటితే నిర్ణయించిన ఫీజుతో పాటు రూ. 100 ఫైన్ తో ఏప్రిల్ 21వ తేదీ వరకు, రూ. 300 తాత్కల్ ఫీజుతో ఏప్రిల్ 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఫీజు చెల్లింపు, దరఖాస్తు ప్రాసెస్ కోసం https://www.polycet.sbtet.telangana.gov.in వెబ్ సైట్ ను సంప్రదించాలి.

మే 13న పాలిసెట్ ఎగ్జామ్…

టీజీ పాలిసెట్ - 2026 పరీక్షను మే 13వ తేదీన నిర్వహిస్తారు. పరీక్ష నిర్వహించిన 12 రోజుల తర్వాత ఫలితాలను ప్రకటిస్తారు. ఏమైనా సందేహాలు ఉంటే 08031404549 ఫోన్ నెంబర్ లేదా te@telangana.gov.in, మెయిల్ ను సంప్రదింవచ్చు.

టీజీ పాలిసెట్ పరీక్షను మొత్తం 120 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్ (60), ఫిజిక్స్ (30), కెమిస్ట్రీ (30) నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 2 గంటల 30 నిమిషాలుగా ఉంటుంది. 10వ తరగతి (SSC) సిలబస్ ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి మరియు నెగిటివ్ మార్కులు ఉండవు.

టీజీ పాలిసెట్ దరఖాస్తు విధానం:

  • ముందుగా polycet.sbtet.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని, మొబైల్ నంబర్ వెరిఫై చేసిన తర్వాత లాగిన్ అయి ఫీజు చెల్లించాలి.
  • ఆ తర్వాత వ్యక్తిగత వివరాలు, విద్యా అర్హతలు, పరీక్షా కేంద్రం ప్రాధాన్యతలను నమోదు చేయాలి.
  • ఫోటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి.
  • చివరగా సబ్మిట్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe