...
...
Next Story

TG POLYCET 2026 : తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్ అప్డేట్ - నేటి నుంచి ఫైనల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు, పూర్తి షెడ్యూల్

TG POLYCET Final Counseling 2026 : తెలంగాణ పాలిసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ నేటి నుంచి ప్రారంభమైంది. జూన్ 16 నుంచి 17వ తేదీ వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు.

Published on: Jun 15, 2026 06:56 AM IST
Advertisement

TG POLYCET Final Counseling 2026 : రాష్ట్రంలోని పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ పాలిసెట్ (TG POLYCET 2026) తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పాలిసెట్ ఎంట్రన్స్ టెస్ట్‌లో అర్హత సాధించి, మొదటి విడతలో సీటు రాని విద్యార్థులతో పాటు, వచ్చిన సీటు కంటే మెరుగైన ఆప్షన్ కోరుకునే అభ్యర్థులు ఈ విడతలో పాల్గొనవచ్చు. ఈ తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 22వ తేదీతో ముగియనుంది.

తెలంగాణ పాలిసెట్ 2026 కౌన్సెలింగ్
తెలంగాణ పాలిసెట్ 2026 కౌన్సెలింగ్

పాలిసెట్ ర్యాంకు సాధించిన అర్హులైన అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్‌సైట్ ( https://tgpolycet.nic.in ) సందర్శించి ఆన్‌లైన్ వేదికగా ప్రవేశాల ప్రక్రియకు సంబంధించిన ప్రాసెస్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లింపు విజయవంతంగా పూర్తయిన తర్వాత, అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలన కోసం హెల్ప్ లైన్ కేంద్రాన్ని ఎంచుకోవాలి. అందుకోసం తమకు అనుకూలమైన తేదీ, సమయాన్ని కేటాయించుకుంటూ స్లాట్ బుకింగ్ చేసుకోవడం తప్పనిసరి.

ముఖ్య తేదీలు:

  • స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులకు జూన్ 16వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది.
  • జూన్ 16 నుండి 17వ తేదీ వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు.
  • జూన్ 17న ఆప్షన్లను ఫ్రీజ్ చేస్తారు.
  • జూన్ 20న లేదా ఆ లోపు ఫైనల్ ఫేజ్ ప్రొవిజనల్ సీట్ల కేటాయింపును అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు.
  • సీటు పొందిన విద్యార్థులు జూన్ 20 నుండి 22వ తేదీల మధ్య ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి.
  • జూన్ 22 నుండి 23వ తేదీ లోపు విద్యార్థులు తమకు కేటాయించిన కళాశాలలో ఒరిజినల్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (T.C), జిరాక్స్ కాపీలను సమర్పించి బయోమెట్రిక్ హాజరు నమోదు చేసుకోవడం తప్పనిసరి.

ఇంటర్నల్ స్లైడింగ్‌కు అవకాశం

దీని ద్వారా విద్యార్థులు తాము ఇప్పటికే సీటు పొంది, అడ్మిషన్ తీసుకున్న కళాశాలలోనే ఖాళీలను బట్టి ఒక కోర్సు నుంచి మరో కోర్సులోకి మారవచ్చు. ఉదాహరణకు మొదట మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లో చేరిన విద్యార్థి, అంతర్గత మార్పుల ద్వారా కంప్యూటర్ సైన్స్ (CME) లేదా ఇతర బ్రాంచ్‌లకు మారడానికి ఈ విండో ఉపయోగపడుతుంది.

జూలై 1 నుంచి స్పాట్ అడ్మిషన్లు

కౌన్సెలింగ్ విడతలు, ఇంటర్నల్ స్లైడింగ్ వంటి ప్రధాన ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత కూడా పాలిటెక్నిక్ కళాశాలల్లో ఏవైనా సీట్లు మిగిలిపోతే వాటిని వృధా కానివ్వకుండా భర్తీ చేయనున్నారు.

ఈ మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం జూలై 1వ తేదీ నుండి జూలై 8వ తేదీల మధ్య ‘స్పాట్ ప్రవేశాలు’ నిర్వహించాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. పాలిసెట్ పరీక్ష రాయకపోయినా, అర్హత మార్కులు రాకపోయినా నిబంధనల ప్రకారం స్పాట్ రౌండ్‌లో మిగిలిన సీట్లను పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఈ తేదీలను గమనించి తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe