రెరా రిజిస్ట్రేషన్ నిబంధనలను పాటించకుండా ప్రాజెక్ట్ ప్రకటనలను ప్రచురించినందుకు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ-రెరా) అనేక రియల్ ఎస్టేట్ డెవలపర్లు, సంస్థలకు షో-కాజ్ నోటీసులు జారీ చేసింది. అనేక ప్రకటనలు తప్పనిసరి రిజిస్ట్రేషన్ నంబర్‌ను పేర్కొనడంలో విఫలమయ్యాయని, నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించలేదని రెరా కనుగొంది.

ఇందులో గోద్రేజ్ ప్రాపర్టీస్, నవనామి ఎలివేట్ ప్రాజెక్ట్, వెర్టెక్స్ విరాట్ ప్రాజెక్ట్, స్వర్గసీమ అమేయ ప్రాజెక్ట్, తిరుమల హిల్స్ వంటి సంస్థలకు నోటీసులు జారీ అయ్యాయి. కొన్ని సందర్భాల్లో డెవలపర్లు రిజిస్ట్రేషన్ నంబర్ ప్రస్తావిస్తున్నారు. కానీ రెరా మార్గదర్శకాలను పాటించడం లేదు. ప్రకటనలు ఫాంట్ పరిమాణం, స్పష్టతకు సంబంధించి రెరా నిబంధనలను పాటించలేదు. స్వర్గసీమ కన్‌స్ట్రక్షన్ అమేయా ప్రాజెక్ట్ విషయంలో ఫాంట్ పరిమాణాలు పాటించకపోవడం, పూర్తి ప్రాజెక్ట్ పేరును తొలగించడం వంటి ముఖ్యమైన ఉల్లంఘనలను అథారిటీ గుర్తించింది. మరో విషయం ఏమిటంటే ప్రాజెక్ట్ లేఅవుట్‌గా నమోదు చేశారని, కానీ తప్పుదారి పట్టించే విధంగా పూర్తి నివాస ప్రాజెక్ట్‌గా ప్రచారం చేసినట్టుగా రెరా దృష్టికి వచ్చింది.
ప్రీ లాంచ్ ప్రకటనలపైనా టీజీ రెరా సీరియస్ అయింది. చెల్లుబాటు అయ్యే టీజీ రెరా రిజిస్ట్రేషన్ పొందకుండా ప్రీ-లాంచ్ ప్రకటనలను విడుదల చేయడం లేదా పెట్టుబడులను అభ్యర్థించవద్దని ప్రమోటర్లు, డెవలపర్లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, ప్రకటనల ప్లాట్‌ఫామ్‌లను అథారిటీ హెచ్చరించింది. అధికారిక ఆమోదం పొందక ముందే కొనుగోలుదారులను ఆకర్షించడానికి చేసే ఏదైనా ప్రయత్నం రియల్ ఎస్టేట్ (నియంత్రణ మరియు అభివృద్ధి) చట్టం, 2016 నిబంధనలను ప్రత్యక్షంగా ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంది.
ఈ చట్టం ప్రకారం, 500 చదరపు మీటర్లు దాటిన లేదా ఎనిమిది కంటే ఎక్కువ అపార్ట్మెంట్లను కలిగి ఉన్న అన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను ప్రకటించడం, మార్కెట్ చేయడం లేదా విక్రయించే ముందు తప్పనిసరిగా TG-RERAలో నమోదు చేసుకోవాలి.
{{/usCountry}}ఈ చట్టం ప్రకారం, 500 చదరపు మీటర్లు దాటిన లేదా ఎనిమిది కంటే ఎక్కువ అపార్ట్మెంట్లను కలిగి ఉన్న అన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను ప్రకటించడం, మార్కెట్ చేయడం లేదా విక్రయించే ముందు తప్పనిసరిగా TG-RERAలో నమోదు చేసుకోవాలి.
{{/usCountry}}అధికారులు ప్రాజెక్ట్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రత్యేకమైన రెరా రిజిస్ట్రేషన్ నంబర్‌ను కేటాయించిన తర్వాత మాత్రమే డెవలపర్‌లు యూనిట్లను ప్రకటించడానికి, మార్కెట్ చేయడానికి లేదా విక్రయించడానికి అనుమతి ఉంది. ఈ నంబర్ అన్ని ప్రకటనల్లో కచ్చితంగా వేయాలి. కొన్ని కంపెనీలు రిజిస్ట్రేషన్ నంబర్‌ను చేరుస్తున్నా.. ప్రకటనల్లో రెరా మార్గదర్శకాలను పాటించడంలో విఫలమయ్యాయని వెల్లడించింది.