TG-RERA : ఇళ్లు లేదా ఫ్లాట్ కొనాలనుకుంటున్నారా..? వెంచర్ వివరాలు 'రెరా'లో చెక్ చేసుకోండి
వెంచర్లలో స్థలాలు కోనుగోలు చేసే వారికి రెరా కీలక సూచనలు చేసింది. రెరా రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా పూర్తి వివరాలను తెలుసుకున్న తర్వాతే కొనుగోలు చేయాలని స్పష్టం చేసింది.
ఇళ్ల స్థలాలు, ఫ్లాట్లు కొనాలనుకునేవారికి తెలంగాణ రెరా కీలక సూచనలు చేసింది. రెరా రిజిస్ట్రేషన్ వివరాలను చెక్ చేసుకున్న తర్వాతనే… కొనుగోలు విషయంలో ముందుకెళ్లాలని సూచించింది.

రెరా రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా ప్రాజెక్ట్(వెంచర్) వివరాలు, లేఅవుట్ ప్లాన్, యాజమాన్యపు హక్కులు మరియు సంబంధిత బ్యాంక్ ఖాతా వివరాలను అధికారిక వెబ్ సైట్ https://rera.telangana.gov.in/ లో సరిచూసుకోవచ్చని ఓ ప్రకటన ద్వారా తెలిపింది. పూర్తి వివరాలను సరి చూసుకున్న తర్వాతనే… ఇళ్లు లేదా ప్లాట్లు కొనాలని స్పష్టం చేసింది.
అక్రమాలపై ఇలా ఫిర్యాదు చేయండి…
రిజిస్ట్రేషన్ లేని ప్రాజెక్టులలో ప్రీ-లాంచ్ ఆఫర్లు లేదా ఈఓఐ వంటివి చట్టవిరుద్ధమని రెరా స్పష్టం చేసింది. ఇలాంటి అక్రమాలపై 040-29394972 (ఫోన్), 9000006301 (వాట్సాప్) లేదా rera-maud@telangana.gov.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చని అథారిటీ స్పష్టం చేసింది.
నిబంధనలు ఉల్లంఘించిన పలు సంస్థలపై రెరా చర్యలు చేపట్టింది. పుప్పాలగూడలోని ‘ప్రణీత్ కాన్సెప్ట్ అంబియన్స్’ ప్రాజెక్టులో అనధికారిక మార్కెటింగ్, విక్రయాలు జరుపుతున్నారన్న ఫిర్యాదులను పరిశీలించి… చర్యలు తీసుకుంది. చట్టబద్ధమైన నిబంధనలను ఉల్లంఘించినందుకు సెక్షన్ 59 కింద రూ.43,71,211 జరిమానాను అథారిటీ విధించింది. దీంతోపాటు ప్రాజెక్టులో రిజిస్టర్ చేయబడిన భాగానికి సంబంధించి డిసెంబర్ 2024 గడువు దాటినా నిర్మాణం పూర్తి కాకపోవడాన్ని అథారిటీ గుర్తించింది. నిర్మాణ ప్రగతి నివేదిక, ప్రాజెక్ట్ నిధుల వినియోగం, అఫిడవిట్‌తో కూడిన సవరించిన గడువును రెండు వారాల్లోపు సమర్పించాలని ప్రమోటర్‌ను ఆదేశించింది.
బాచుపల్లిలోని ఆవాస్ హైదరాబాద్ ప్రాజెక్టులో పాత యజమానుల బకాయిలను కొత్త కొనుగోలుదారులపై రుద్దడాన్ని రెరా తీవ్రంగా తప్పుబట్టింది. ఆలస్య రుసుములను తొలగించి, సవరించిన ఖాతా వివరాలను అందించాలని పసిఫికా కన్ స్ట్రక్షన్‌ను ఆదేశించింది. పాత కొనుగోలుదారుల బకాయిల బాధ్యతను తర్వాతి కొనుగోలుదారులపై ప్రమోటర్ వేయలేరని స్పష్టం చేసింది.
రెరా అంటే ఏంటి..?
- రియల్ ఎస్టేట్ రంగాన్ని నియంత్రించేందుకు ఏర్పాటు చేసిదే RERA (రియల్ ఎస్టేట్ రెగ్యులరేటరీ అథారిటీ). వెంచర్లతో పాటు అపార్ట్‌మెంట్‌లను నిర్మించే బిల్డర్స్ కచ్చితంగా రెరా అనుమతులు తీసుకోవాల్సిందే.
- రెరా రిజిస్ట్రేషన్ లేకుండా ప్లాట్లు లేదా అపార్ట్‌మెంట్లు విక్రయాలు, బుకింగ్స్, ప్రచార కార్యక్రమాలు చేపట్టకూడదు. రిజిస్ట్రేషన్ లేకుండా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తే చట్ట పరంగా చర్యలు ఎదుర్కోవలసి ఉంటుంది.
- రెరా రిజిస్ట్రేషన్ లేకుండా వ్యాపారాలు నిర్వహించడం అనేది నేరం.
- రెరా అథారిటీ నోటీసులు పంపించినా పట్టించుకోకుండా ఉల్లంఘనలు కొనసాగిస్తే ప్రాజక్టు విలువలో 5 శాతం వరకు జరిమానా కట్టాల్సి వస్తుంది. అంతే కాదు కొన్నిసార్లు జైలు శిక్ష కూడా పడవచ్చు.
- రెరా అథారిటీకి నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టే అధికారం కూడా ఉంటుంది.
- రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు ఎలాంటి అనుమతుల్లేకుండానే ప్రీలాంచ్, ఈవోఐ (ఆసక్తి వ్యక్తీకరణ) పేరిట విక్రయించడం చట్టవిరుద్ధమే. రాతపూర్వక ఒప్పందం లేకుండా 10 శాతానికి మించి వసూలు చేయడానికి వీల్లేదు.
- గడువులోగా నిర్మాణాలను పూర్తి చేసి ఆ ప్రాజెక్టు నిర్వహణకు సంక్షేమ సొసైటీని ఏర్పాటు చేసి బాధ్యతలు అప్పగించే వరకు నిర్వహణ ఖర్చులన్నీ నిర్మాణదారే భరించాలి. వసూలు చేసిన కార్పస్ ఫండ్‌ను నిర్మాణం పూర్తయిన వెంటనే సొసైటీకి అప్పగించాలి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

