TG SET 2025 : తెలంగాణ 'సెట్' ఎగ్జామ్ అప్డేట్ - మీ సబ్జెక్ట్ సిలబస్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి

తెలంగాణ సెట్ - 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుతం ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఇందుకు సంబంధించిన సిలబస్ వివరాలు కూడా అందుబాటులోకి వచ్చాయి.

Published on: Oct 20, 2025, 10:05:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ - 2025 నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. ఈ గడువు అక్టోబర్ 30వ తేదీతో ముగుస్తుంది. రూ. 3 వేల అపరాధ రుసుంతో నవంబర్ 11వ తేదీ వరకు అవకాశం ఉంది. డిసెంబర్ 2వ వారంలో పరీక్షలను నిర్వహిస్తారు.

తెలంగాణ సెట్ - 2025
తెలంగాణ సెట్ - 2025

రాష్ట్రంలోని అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్‌ ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సెట్‌ నిర్వహిస్తుంది. రెండు పేపర్లలో నిర్వహిస్తారు. పేప‌ర్-1లో 50 ప్రశ్నల‌కు 100 మార్కులు, పేప‌ర్-2లో 100 ప్రశ్నల‌కు 200 మార్కులతో నిర్వహిస్తారు. కంప్యూట‌ర్ బేస్డ్ ప‌ద్ధతిలో మూడు గంటల పాటు ప‌రీక్ష నిర్వహించ‌నున్నారు. టీఎస్ సెట్ నోటిఫికేష‌న్‌తో పాటు ఇతర స‌మాచారం కోసం http://telanganaset.org/ వెబ్ సైట్ ను చూడొచ్చు.

ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగా… సిలబస్ వివరాలు కూడా వెబ్ సైట్ లో ఉంచారు. మొత్తం 29 సబ్జెక్టుల సిలబస్ కాపీలను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి…

టీజీ సెట్ - 2025 సిలబస్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి…

  1. అభ్యర్థులు మొదటగా http://telanganaset.org/notification.html వెబ్ సైట్ ను సందర్శించాలి.
  2. హోంపేజీలో కనిపించే Syllabus అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  3. ఇక్కడ PAPER – I(General Paper) అని కనిపిస్తోంది. దాని పక్కనే Download అని ఉంటుంది. దానిపై నొక్కితే పేపర్ -1 సిలబస్ ను పొందవచ్చు.
  4. ఇక పేపర్ - 2(సబ్జెక్టులు) వివరాలు కూడా ఇక్కడ డిస్ ప్లే అవుతాయి. చివర్లో ఉండే డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి సిలబస్ ను పొందవచ్చు.
  5. మొత్తం 29 సబ్జెక్టుల పేర్లు కనిపిస్తాయి. ఇందులో మీరు దేనికైతే అప్లయ్ చేశారో ఆ సబ్జెక్ట్ పక్కన ఉంటే డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కితే…. మీ సిలబస్ కాపీని పొందవచ్చు.
  6. డౌన్లోడ్ లేదా ప్రింట్ కూడా తీసుకోవచ్చు.

ఆబ్జెక్టివ్‌ తరహాలో 50 ప్రశ్నలకు పేపర్‌–1 ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కులు కేటాయిస్తారు. ఇందులో అభ్యర్థుల బోధన/పరిశోధన ఆప్టిట్యూడ్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలుంటాయి. అలాగే తార్కిక సామర్థ్యం, గ్రహణశక్తి, భిన్నమైన ఆలోచనల దృక్పథాన్ని పరిశీలించే విధంగా ప్రశ్నలు అడుగుతారు.ఈ పేపర్‌లో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్టు నుంచి ఆబ్జెక్టివ్‌ తరహాలో ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కుల చొప్పున 100 ప్రశ్నలను అడుగుతారు. హాల్ టికెట్లు డిసెంబర్ 3వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయి. డిసెంబర్ 2వ వారం నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More