TG SSC Exams 2026 : టెన్త్ విద్యార్ధుల వివరాల సవరణకు ఎడిట్‌ ఆప్షన్‌ - చివరి తేదీ ఇదే!

తెలంగాణ పదోతరగతి పబ్లిక్‌ పరీక్షలకు 2026 హాజరయ్యే విద్యార్థులు తమ వివరాలను ఆన్‌లైన్‌లో తప్పుగా నమోదు చేస్తే సరిచేసుకోవచ్చు. నామినల్‌ రోల్స్‌ ఎవైనా తప్పులు దొర్లితే అలాగే ద్రువపత్రాల్లో కూడా తప్పుగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈనెల 22 నుంచి 30 వరకు తప్పుగా ఉన్న వివరాలను ఎడిట్ చేసుకోవచ్చు.

Published on: Dec 21, 2025, 09:16:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షలకు 2026 హాజరయ్యే విద్యార్థులు తమ వివరాలను సవరించుకునేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం అవకాశం కల్పించింది. నామినల్‌ రోల్స్‌ ఎవైనా తప్పులు దొర్లితే అలాగే సర్టిఫికెట్లలో కూడా తప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరోసారి నామినల్ రోల్స్ ను చెక్ చేసుకొని… వాటిలో ఏమైనా తప్పులు ఉంటే ఎడిట్ చేసుకోవాలని సూచించింది.

పదో తరగతి పరీక్షలు
పదో తరగతి పరీక్షలు

నామినల్ రోల్స్ ఎడిట్ కోసం ఈనెల 22 నుంచి 30వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. సంబంధిత పాఠశాలల హెచ్‌ఎంలు/ప్రిన్సిపాళ్లు విద్యార్థుల నామినల్ రోల్స్ సరిచేసుకోవాల్సి ఉంటుంది. క్షుణ్నంగా పరిశీలించి… తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం స్పష్టం చేసింది.

మరోవైపు కొద్దిరోజుల కిందటే తెలంగాణ పదో తరగతి పరీక్ష టైమ్ టేబుల్ 2026 విడుదలైంది. మార్చి 2026లో ఈ పరీక్షలు ప్రారంభమవుతాయి. 2026 మార్చి 14 శనివారం ప్రారంభమై.. ఏప్రిల్ 16వ తేదీన ముగుస్తాయి. పరీక్షలు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహిస్తారు. ఫిజిక్స్, బయోలజీ ఎగ్జామ్స్ సమయంలో మాత్రం మార్పులు ఉంటాయి.

టీజీ టెన్త్ ఎగ్జామ్స్ 2026 - టైమ్ టేబుల్

  • 14-03-2026, శనివారం, ఫస్ట్ లాంగ్వేజ్ (గ్రూప్-ఏ), ఫస్ట్ లాంగ్వేజ్ పార్ట్-I, ఫస్ట్ లాంగ్వేజ్ పార్ట్-II
  • 18-03-2026, బుధవారం, సెకండ్ లాంగ్వేజ్
  • 23-03-2026, సోమవారం, థర్డ్ లాంగ్వేజ్(ఇంగ్లీష్)
  • 28-03-2026, శనివారం, మ్యాథమెటిక్స్
  • 02-04-2026, గురువారం, సైన్స్ పార్ట్-I(ఫిజికల్ సైన్స్)
  • 07-04-2026, మంగళవారం, సైన్స్ పార్ట్-II(బయోలాజికల్ సైన్స్)
  • 13-04-2026, సోమవారం, సోషల్ స్టడీస్
  • 15-04-2026, బుధవారం, ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-I(సంస్కృతం, అరబిక్), ఎస్ఎస్‌సీ వొకేషనల్ కోర్స్(థియరీ)
  • 16-04-2026, గురువారం, ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-II(సంస్కృతం, అరబిక్)

అన్ని సాధారణ అకడమిక్ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయి. అయితే ఆబ్జెక్టివ్ టైప్(పార్ట్ బీ) ప్రశ్నలకు చివరి 30 నిమిషాల్లో సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఫిజిక్స్, బయాలజీ పరీక్షలు ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు మాత్రమే ఉంటాయి. చివరి 15 నిమిషాల్లోనే సమాధానాలు పార్ట్ బీ రాయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని అధికారులు సూచించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More