TG SSC Results 2026 : తెలంగాణ టెన్త్ ఫలితాలపై బిగ్ అప్డేట్ - విడుదలకు ముహుర్తం ఫిక్స్..! ఎక్కడ చెక్ చేసుకోవాలంటే..?

Telangana SSC Results 2026 : తెలంగాణలో 10వ తరగతి ఫలితాల విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 29 లేదా 30వ తేదీన ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 5.15 లక్షల మంది ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

Published on: Apr 28, 2026, 07:38:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలోని పదో తరగతి విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే వీరి నిరీక్షణకు తెరపడే సమయం దగ్గరపడింది. ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న టెన్త్ ఫలితాలను ఈ నెల 29న లేదా 30వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రభుత్వ పరీక్షల విభాగం ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది.

10వ తరగతి ఫలితాలు (istock image )
10వ తరగతి ఫలితాలు (istock image )

మొదట మే మొదటి వారంలో ఫలితాలు వస్తాయని భావించినప్పటికీ… ఈ నెలాఖారు నాటికే ఫలితాలను ప్రకటించనున్నారు. స్పాట్ వాల్యూయేషన్ తో పాటు ఇతర ప్రక్రియలు వేగంగా పూర్తి కావటంతో ముందుగానే విడుదల చేయాలని నిర్ణయించారు.

రాష్ట్రవ్యాప్తంగా మార్చి 14వ తేదీ నుంచి ప్రారంభమైన పదో తరగతి ప్రధాన పరీక్షలు ఏప్రిల్ 13వ తేదీతో ముగిశాయి. సుమారు 5.15 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు ముగిసిన వెంటనే విద్యాశాఖ యుద్ధ ప్రాతిపదికన జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ప్రారంభించింది. ఈ నెల 23వ తేదీ నాటికే పేపర్ల దిద్దుబాటు ప్రక్రియను అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. మార్కుల నమోదు, క్రోడీకరణ ప్రక్రియను కూడా వేగంగా నిర్వహించి….. ఫలితాలను సిద్ధం చేశారు.

సర్కార్ గ్రీన్ సిగ్నల్…!

ఫలితాల విడుదలకు సంబంధించి విద్యాశాఖ పంపిన ప్రతిపాదనలకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ నెల 29న (బుధవారం) ఫలితాలను ప్రకటించేందుకు ప్రాథమికంగా నిర్ణయించారు. ఒకవేళ సాంకేతిక కారణాల వల్ల ఆ రోజు వీలుకాకపోతే, మరుసటి రోజైన 30వ తేదీన ప్రకటించే అవకాశం ఉంది. ఇంటర్ ఫలితాల మాదిరిగానే ఈ ఫలితాలను కూడా ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు చేతుల మీదుగా విడుదల చేస్తారని తెలిసింది.

TG SSC ఫలితాలను ఎక్కడ చెక్ చేసుకోవాలి…?

తెలంగాణ టెన్త్ ఫలితాలను https://bse.telangana.gov.in/ లేదా results.cgg.gov.in వెబ్ సైట్లలో తెలుసుకోవచ్చు. హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా చెక్ చేసుకోవచ్చు. అయితే ఈసారి ఎస్సెస్సీ బోర్డు కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే హాల్‌టికెట్లను సైతం వాట్సాప్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకొనే వెసులుబాటు కల్పించిన బోర్డు….. తాజాగా ఫలితాలను సైతం వాట్సాప్‌ ద్వారా తెలుసుకొనే వీలు కల్పించింది.

పరీక్ష రాసిన విద్యార్థులు…. 80969 58096 నంబర్‌కు ‘హాయ్‌’ అని సందేశం పంపించాలి. ఆ తర్వాత ఎస్సెస్సీ రిజల్ట్స్‌ అని టైప్‌చేసి హాల్‌టికెట్‌ నంబర్‌, ఇతర వివరాలు నమోదుచేయాలి. ఆ తర్వాత ఫలితం స్క్రీన్‌పై డిస్ ప్లే అవుతుంది.

అంతేకాకుండా గతేడాది మాదిరిగానే హిందుస్తాన్ టైమ్స్ వెబ్ సైట్ ( https://www.hindustantimes.com/ ) లోనూ ఫలితాలు అందుబాటులో ఉంటాయి. విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా మార్కుల వివరాలను వేగంగా తెలుసుకోవచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More