CUET PG 2026 : సీయూఈటీ ఫీజీ ఫలితాలు వచ్చేశాయి.. నెక్ట్స్​ ఏంటి?

CUET PG 2026 : సీయూఈటీ ఫీజీ 2026 ఫలితాలు ఇటీవలే విడుదలయ్యాయి. మరి నెక్ట్స్ ప్రాసెస్​​ ఏంటి? సీట్ల కేటాయింపు ప్రక్రియ ఎలా జరుగుతుంది? ఇక్కడ తెలుసుకోండి..

Published on: Apr 26, 2026, 12:18:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలు, ఇతర ప్రముఖ విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన 'కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్' (సీయూఈటీ పీజీ 2026) ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇటీవలే విడుదల చేసింది. ఈ ఫలితాల ఆధారంగా దేశంలోని 198 యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందవచ్చు. మరి ఫలితాల తర్వాత నెక్ట్స్​ ప్రాసెస్​ ఎంటి? ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

సీయూఈటీ పీజీ అప్డేట్స్..
సీయూఈటీ పీజీ అప్డేట్స్..

సీయూఈటీ పీజీ 2026..

ఈ ఏడాది మార్చి 6 నుంచి 30 వరకు జరిగిన ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా సుమారు 5,04,301 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 157 సబ్జెక్టుల కోసం 50 షిఫ్టుల్లో ఎన్టీఏ ఈ పరీక్షలను నిర్వహించింది. ఫలితాలు విడుదల కావడంతో అభ్యర్థులు తమ స్కోర్‌కార్డులను అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అభ్యర్థులు తమ ఫలితాలను పొందడానికి exams.nta.nic.in/cuet-pg వెబ్​సైట్​ని సందర్శించి, అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.

సీయూఈటీ పీజీ 2026- కౌన్సెలింగ్ ప్రక్రియ: మీరు చేయాల్సింది ఇదే!

చాలామంది విద్యార్థులు ఫలితాలు రాగానే అడ్మిషన్ వచ్చేసిందని భావిస్తారు. కానీ, అసలు ప్రక్రియ ఇప్పుడే మొదలవుతుంది. ఎన్టీఏ కేవలం పరీక్షను నిర్వహించి స్కోర్‌ను మాత్రమే ఇస్తుంది. సీట్ల కేటాయింపును ఆయా యూనివర్సిటీలే స్వయంగా చేపడతాయి.

యూనివర్సిటీల వారీగా రిజిస్ట్రేషన్: మీరు ఏ యూనివర్సిటీలో (ఉదాహరణకు హెచ్‌సీయూ, జేఎన్‌యూ, బీహెచ్‌యూ) చేరాలనుకుంటున్నారో, ఆయా యూనివర్సిటీల అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించి కౌన్సెలింగ్ కోసం విడిగా దరఖాస్తు చేసుకోవాలి.

మెరిట్ జాబితాల విడుదల: మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత, మీ సీయూఈటీ స్కోర్ ఆధారంగా సదరు యూనివర్సిటీ తన సొంత మెరిట్ లిస్టును ప్రకటిస్తుంది.

డాక్యుమెంట్ వెరిఫికేషన్: మెరిట్ లిస్టులో పేరు వచ్చిన వారు నిర్ణీత సమయంలో యూనివర్సిటీకి వెళ్లి ఒరిజినల్ సర్టిఫికేట్లను సమర్పించి, ఫీజు చెల్లించి అడ్మిషన్ ఖరారు చేసుకోవాలి.

సీయూఈటీ పీజీ 2026 యూనివర్సిటీల నెట్‌వర్క్: ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి?

ఈ ఏడాది సీయూఈటీ పీజీ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్న సంస్థల సంఖ్య గణనీయంగా పెరిగింది. మొత్తం 198 విద్యాసంస్థలు ఈ గొడుగు కిందకు వచ్చాయి:

కేంద్ర విశ్వవిద్యాలయాలు - 45

రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు - 40

ప్రభుత్వ సంస్థలు - 24

ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీలు - 89

ముఖ్య గమనిక: సీయూఈటీ పీజీ 2026 స్కోర్ కేవలం 2026-27 విద్యా సంవత్సరానికి మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అభ్యర్థులు తాము కోరుకున్న యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండటం మంచిది.

తరచుగా అడిగే ప్రశ్నలు -

1. సీయూఈటీ పీజీ ఫలితాలను ఎక్కడ చూసుకోవాలి?

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ exams.nta.nic.in/cuet-pg లో తమ ఫలితాలను చూసుకోవచ్చు.

2. కౌన్సెలింగ్ ఎవరు నిర్వహిస్తారు?

ఎన్టీఏ కేవలం ఫలితాలను మాత్రమే ఇస్తుంది. కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపును ఆయా యూనివర్సిటీలే విడివిడిగా నిర్వహిస్తాయి.

3. అడ్మిషన్ కోసం స్కోర్ ఎంత కాలం చెల్లుతుంది?

సీయూఈటీ పీజీ 2026 స్కోర్ కేవలం ఈ విద్యా సంవత్సరం (2026-27) ప్రవేశాలకు మాత్రమే ఉపయోగపడుతుంది.

4. స్కోర్‌కార్డ్ డౌన్‌లోడ్ చేయడానికి ఏ వివరాలు కావాలి?

అభ్యర్థి అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు ఉంటే సరిపోతుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More