తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ను అందించింది. టెట్(TET) ఉత్తీర్ణత సర్టిఫికెట్లను మీసేవ కేంద్రాల ద్వారా జారీ చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. గతంలో అభ్యర్థులు నేరుగా టెట్ అధికారిక వెబ్‌సైట్ నుండి ఫలితాలు, డిజిటల్ మెమోలను డౌన్‌లోడ్ చేసుకునే సౌలభ్యం ఉండేది. కానీ తొలిసారిగా ఈ విధానంలో మార్పులు చేస్తూ మీసేవ ద్వారా అధికారిక ధ్రువపత్రాలను అందజేయనున్నారు.

ఈ కొత్త విధానం ద్వారా అభ్యర్థులకు అత్యంత సురక్షితమైన సెక్యూరిటీ ఫీచర్స్‌తో కూడిన ఒరిజినల్ సర్టిఫికెట్లు లభిస్తాయని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ వెల్లడించారు. టెట్ పాస్ అయిన అభ్యర్థులతో పాటు ఫెయిల్ అయిన వారికి కూడా వారి ఫలితాల ధ్రువపత్రాలను మీసేవలో అందుబాటులో ఉంచనున్నారు. ఈ సర్టిఫికెట్ పొందేందుకు అభ్యర్థులు మీసేవ కేంద్రంలో రూ. 60 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
మీ సేవ ద్వారా జారీ చేసే టెట్ పత్రాలు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల్లాగే ఉంటాయి. సర్టిఫికెట్ మీద ప్రత్యేకంగా ఒక బార్‌కోడ్, నంబర్ కూడా ఇస్తారు. 2011 నుంచి ఇప్పటి వరకు టెట్ పరీక్ష పాసైన వారందరికి ముద్రిత మెమోలు జారీచేయనున్నట్టుగా పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు.
ఈ మెమో మీద అభ్యర్థి పేరు, ఫొటో, వేలిముద్ర/సంతకం, అభ్యర్థి పొందిన మార్కుల వివరాలు ఉంటాయి. గతంలో టెట్ పరీక్ష పాసైన వారికి రెండుసార్లు ముద్రిత మెమోలు జారీ చేశారు. తర్వాత ఆన్‌లైన్ మెమోలను మాత్రమే ఇస్తున్నారు. ఈ కారణంగా నకిలీ మెమోలు తయారు చేస్తున్నట్టుగా విద్యాశాఖ గుర్తించింది. దీంతో ముద్రిత మెమోలు మీ సేవ ద్వారా జారీ చేయాలని నిర్ణయించింది.
ప్రభుత్వ ఉపాధ్యాయ నియామకాల సాధనకు టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. దీనితో పాటు ప్రైవేట్ పాఠశాలల్లో టీచర్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు ఈ మీసేవ ధ్రువపత్రం ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రైవేట్ యాజమాన్యాలు కూడా బోధనా సిబ్బందిని నియమించుకునే ముందు టెట్ అర్హతను ప్రామాణికంగా తీసుకుంటున్న నేపథ్యంలో, ఈ హై-సెక్యూరిటీ సర్టిఫికెట్ నకిలీ పత్రాలకు చెక్ పెడుతుంది.
{{/usCountry}}ప్రభుత్వ ఉపాధ్యాయ నియామకాల సాధనకు టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. దీనితో పాటు ప్రైవేట్ పాఠశాలల్లో టీచర్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు ఈ మీసేవ ధ్రువపత్రం ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రైవేట్ యాజమాన్యాలు కూడా బోధనా సిబ్బందిని నియమించుకునే ముందు టెట్ అర్హతను ప్రామాణికంగా తీసుకుంటున్న నేపథ్యంలో, ఈ హై-సెక్యూరిటీ సర్టిఫికెట్ నకిలీ పత్రాలకు చెక్ పెడుతుంది.
{{/usCountry}}అభ్యర్థులు తమ టెట్ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను మీసేవ కేంద్రంలో అందించి సులభంగా సర్టిఫికెట్ పొందవచ్చు. క్యూఆర్ కోడ్, ప్రత్యేక సెక్యూరిటీ ఫీచర్ల వల్ల ధ్రువపత్రాల పరిశీలన పారదర్శకంగా మారుతుంది. ఈ నూతన విధానం వల్ల ఆన్‌లైన్ డౌన్‌లోడ్ సమస్యలు తప్పడమే కాకుండా, అభ్యర్థులకు అధికారికంగా చెల్లుబాటయ్యే ప్రింటెడ్ ధ్రువపత్రాలు నేరుగా అందుబాటులోకి వస్తాయి.