TG TET Hall Ticket 2026 : తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TG TET) 2026 ఇన్-సర్వీస్ టీచర్స్ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను పాఠశాల విద్యాశాఖ అధికారికంగా విడుదల చేసింది. సెప్టెంబర్ 2, 2026న వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ అడ్మిట్ కార్డులను అర్హులైన అభ్యర్థులు డిపార్ట్‌మెంట్ అధికారిక పోర్టల్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో జరగనున్న ఈ టెట్ పరీక్షకు హాజరుకానున్నారు. పాఠశాల విద్యాశాఖ ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం ఇన్-సర్వీస్ టీచర్ల తెలంగాణ టెట్ ఆన్‌లైన్ పరీక్షలు సెప్టెంబర్ 7 నుండి సెప్టెంబర్ 11, 2026 వరకు నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రాల్లోకి ప్రవేశించడానికి హాల్ టికెట్ ప్రింట్‌అవుట్ తప్పనిసరి. చెల్లుబాటు అయ్యే అడ్మిట్ కార్డ్ లేని పక్షంలో అభ్యర్థులను ఇన్విజిలేటర్లు లోపలికి అనుమతించరు.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలతోపాటు అనేక రకాల సంక్షేమ విద్యా సంస్థల్లో విధుల్లో ఉన్న ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. ప్రభుత్వ, స్థానిక సంస్థల (జడ్పీ, ఎంపీపీ) పాఠశాలల ఉపాధ్యాయులు, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (TGREIS) టీచర్లు, వివిధ ప్రభుత్వ సంక్షేమ గురుకుల విద్యాలయాల ఉపాధ్యాయులు, తెలంగాణ మోడల్ స్కూల్స్ (Model Schools) టీచర్లు, రాష్ట్ర ప్రభుత్వ ఇతర విభాగాల పరిధిలో పనిచేస్తున్న సంబంధిత ఉపాధ్యాయులు టెట్ క్వాలిఫై కావాలి.
TG TET ఇన్ సర్వీస్ పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్ సీబీటీ పద్ధతిలో జరుగుతుంది. ఇందులో పేపర్-1, పేపర్-2 అనే రెండు విభాగాలు ఉంటాయి. విద్యాశాఖ ముందే నిర్ణయించి విడుదల చేసిన సిలబస్ మరియు ఎగ్జామ్ పాట్రన్ ఆధారంగా అభ్యర్థులు సిద్ధం కావలసి ఉంటుంది.
టీజీ టెట్ అడ్మిట్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
ముందుగా తెలంగాణ టెట్ అధికారిక వెబ్‌సైట్ tgtet.aptonline.in ను ఓపెన్ చేయాలి.
{{/usCountry}}ముందుగా తెలంగాణ టెట్ అధికారిక వెబ్‌సైట్ tgtet.aptonline.in ను ఓపెన్ చేయాలి.
{{/usCountry}}హోమ్‌పేజీలో కనిపించే TG TET In-Service Teachers Admit Card 2026 లింక్‌పై క్లిక్ చేయాలి.
మీ ఆధార్ నంబర్, జర్నల్ నంబర్, నమోదు చేసుకున్న మొబైల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
సబ్మిట్ బటన్ నొక్కగానే మీ హాల్ టికెట్ పీడీఎఫ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
దానిని సేవ్ చేసుకుని, ప్రింట్‌అవుట్ తీసుకోవాలి.
హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత అభ్యర్థులు అందులోని తమ పేరు, ఫోటో, సంతకం, పరీక్ష తేదీ, సమయం, కేటాయించిన సెంటర్ అడ్రస్ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. పరీక్ష రోజున హాల్‌టికెట్ కాపీతో పాటు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ లేదా ఏదైనా ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డును వెంట తీసుకెళ్లాలి. ఉపాధ్యాయులు ముందుగానే అడ్మిట్ కార్డులను ప్రింట్ తీసుకుని సిద్ధంగా ఉంచుకోవాలని విద్యాశాఖ సూచించింది.
ఈ లింక్ క్లిక్ చేసి TG-TET Hall Ticket Download చేసుకోండి.