...
...
Next Story

TG TET 2025 : తెలంగాణ టెట్ అభ్యర్థులకు అప్డేట్ - ఈనెల 27న హాల్ టికెట్లు విడుదల..!

తెలంగాణ టెట్ - 2026 హాల్ టికెట్లపై అప్డేట్ వచ్చింది. డిసెంబర్ 27వ తేదీన హాల్ టికెట్లు విడదలవుతాయి. https://tgtet.aptonline.in/tgtet/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. జనవరి 3వ తేదీ నుంచి పరీక్షలు జరుగుతాయి.

Published on: Dec 11, 2025, 15:44:45 IST
Advertisement

టీజీ టెట్ - 2026 దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. ఈసారి గతంతో పోల్చితే భారీగా దరఖాస్తులు వచ్చాయి. పేపర్‌1, 2, కలిపి మొత్తం 2,37,754 దరఖాస్తులు అందాయి. ఇందులో 71,670 మంది ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులున్నారు.

ఈనెల 27న హాల్ టికెట్లు విడుదల

తెలంగాణ టెట్ హాల్ టికెట్లు 2026
తెలంగాణ టెట్ హాల్ టికెట్లు 2026

టీజీ టెట్ - 2026 పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు డిసెంబర్‌ 27 నుంచి అందుబాటులోకి వస్తాయి. https://tgtet.aptonline.in/tgtet/ వెబ్ సైట్ నుంచి అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

తెలంగాణ టెట్ - 2026 హాల్ టికెట్లు - ప్రాసెస్ ఇలా

  1. అభ్యర్థులు https://tgtet.aptonline.in/tgtet/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలో కనిపించే ‘ Hall Ticket Download’ ఆప్షన్ పై నొక్కాలి.
  3. జర్నల్ నెంబర్ తో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
  4. సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
  5. డౌన్లోడ్ అనే ఆప్షన్ పై నొక్కి హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.
  6. పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలంటే హాల్ టికెట్ తప్పనిసరి.

ఎగ్జామ్స్ ఎప్పుడంటే..?

వచ్చే ఏడాది జనవరి 3 నుంచి జనవరి 31 వరకు తెలంగాణ టెట్ పరీక్షలు జరుగుతాయి. టెట్ పరీక్షలో ఒక్కసారి అర్హత సాధిస్తే ఎన్నిసార్లు అయినా టెట్ రాయవచ్చు. ఎక్కువ స్కోర్ ఉన్న టెట్ పరీక్షనే పరిగణనలోకి తీసుకుంటారు.

తెలంగాణ టెట్ పరీక్షను మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. టెట్ ఎగ్జామ్ లో ఓసీ అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇక బీసీ అభ్యర్థులు 50 శాతం, ఎస్టీ, ఎస్సీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ 40 శాతం అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks