హైదరాబాద్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (టీజీ ట్రాన్స్ కో) నుంచి అప్రెంటిస్ నోటిఫికేషన్ జారీ అయింది. ఒక ఏడాది అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఈ ప్రక్రియ ఈనెల 20వ తేదీ నుంచి ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు… ఫిబ్రవరి 27వ తేదీ వరకు ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 250 ఖాళీలను భర్తీ చేస్తారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌ల విభాగంలో 125 పోస్టులు, టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్‌ల విభాగంలో 125 పోస్టులను భర్తీ చేస్తారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ లుగా ఎంపికైన వారికి నెలకు రూ. రూ.17,500 స్టైపెండ్, డిప్లోమా అప్రెంటిస్ లుగా ఎంపికైన వారికి రూ. 15,000 స్టైపెండ్ చెల్లిస్తారు.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఈఈఈ, ఈసీఈ, సీఎస్‌ఈ, మెకానికల్, సివిల్ లేదా ఐటీ విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఇక డిప్లోమా అప్రెంటిస్ కు అయితే డీఈఈ, డీఈసీఈ, డీఎంఈ, డీసీఈ, డీసీఎస్‌సీ విభాగంలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్థులు 2023, 2024 లేదా 2025 సంవత్సరాల్లో పాసే ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
టీజీ ట్రాన్స్ కో అప్రెంటిస్ నోటిఫికేషన్ - ముఖ్యమైన వివరాలు :
- అప్రెంటిస్ నోటిఫికేషన్ - ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్
- అప్రెంటిస్ ఖాళీలు - 250
- దరఖాస్తులకు చివరి తేదీ - 27 ఫిబ్రవరి 2026(టీజీ ట్రాన్స్ కో పోర్టల్ ద్వారా)
- NATS పోర్టల్ ద్వారా దరఖాస్తుకు చివరి తేదీ - 26 ఫిబ్రవరి 2026. (https://nats.education.gov.in/)
- ఎంపిక విధానం - అభ్యర్థుల దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎంపికైన వారికి మెయిల్ ద్వారా సమాచారం ఇస్తారు.
- ఏడాదికి కాలానికిగానూ అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారు.
- రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఏమైనా సందేహాలుంటే సంప్రదించాల్సిన మెయిల్ అడ్రస్ - studentquery@boat-srp.com, applacement@boat-srp.com.
- అధికారిక వెబ్ సైట్ - https://nats.education.gov.in/ , https://tgtransco.com/