...
...
Next Story

TGHB Recruitment 2026 : తెలంగాణ హౌసింగ్ బోర్డు నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ - దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

తెలంగాణ హౌసింగ్ బోర్డు (TGHB), హైదరాబాద్ CURE పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం 25 అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అక్టోబరు 21 చివరి తేదీ.

Published on: Oct 14, 2026, 13:38:03 IST
Advertisement

హైదరాబాద్ నగరంలో ఇల్లు లేని పేదలకు సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'ఇందిరమ్మ ఇండ్లు - అఫోర్డబుల్ అర్బన్ హౌసింగ్ ప్రోగ్రామ్' వేగవంతానికి తెలంగాణ హౌసింగ్ బోర్డు (TGHB) కీలక అడుగు వేసింది.ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న సీయూఆర్‌ఈ (CURE) పరిధిలో చేపట్టే నిర్మాణ పనుల పర్యవేక్షణ కోసం తాత్కాలిక (ఔట్‌సోర్సింగ్) ప్రాతిపదికన అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఖాళీల వివరాలు…

  • మొత్తం 25 అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.
  • గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా బోర్డు నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో బి.ఈ (B.E) లేదా బి.టెక్ (B.Tech) పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  • అభ్యర్థులకు మల్టీస్టోర్డ్ రెసిడెన్షియల్ లేదా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులలో కనీసం రెండేళ్ల పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
  • హైరైజ్ బిల్డింగ్ ప్రాజెక్ట్‌లు, ఈపీసీ (EPC) పనులు, క్వాలిటీ కంట్రోల్ (QC), క్వాంటిటీ సర్వేయింగ్, ఆటోక్యాడ్ , అంచనాల రూపకల్పనలో అనుభవం ఉన్నవారికి ఎంపికలో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు.
  • ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 2026 జూలై 1 నాటికి కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి, అలాగే 44 ఏళ్లు మించకూడదు.
  • ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.33,800 చొప్పున వేతనం చెల్లిస్తారు.
  • ఎంపికైన వారికి TGHB చీఫ్ ఇంజినీర్ లేదా డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ కేటాయించిన విధంగా హైదరాబాద్ క్యూర్ ప్రాంతంలో పోస్టింగ్ ఇస్తారు.

ఎంపిక ప్రక్రియ - దరఖాస్తు విధానం

TGHB ఉద్యోగ ప్రకటన
TGHB ఉద్యోగ ప్రకటన

క్వాలిఫైయింగ్ పరీక్షలో వచ్చిన ప్రతిభ (మెరిట్) ఆధారంగా అభ్యర్థులను ప్రాథమికంగా ఎంపిక చేస్తారు. అనంతరం టీజీహెచ్‌బీ (TGHB) చీఫ్ ఇంజినీర్ కార్యాలయం మరియు ఏజెన్సీ సంయుక్తంగా నిర్వహించే ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు కేవలం గూగుల్ ఫారమ్ (Google Form) ఆన్‌లైన్ లింక్ ద్వారా మాత్రమే తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

దరఖాస్తులు సమర్పించడానికి 2026 అక్టోబరు 21 సాయంత్రం 5:00 గంటల వరకు గడువు ఇచ్చారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు బోర్డు అధికారిక వెబ్‌సైట్ www.tghb.telangana.gov.in సందర్శించి ఆన్‌లైన్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ నియామకం పూర్తిగా ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన మాత్రమే జరుగుతుందని…. ఇది హౌసింగ్ బోర్డులో శాశ్వత ఉద్యోగానికి ఎలాంటి హక్కును కల్పించదని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks