తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) Deputy Educational Officer / Head Master Grade - I ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పాఠశాల విద్యాశాఖలో మెుత్తం 24 పోస్టులను భర్తీ చేయనుంది.

అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.tgpsc.gov.in ద్వారా జూన్ 12 నుండి జూలై 19, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదవాలని కమిషన్ సూచించింది. ఈ నోటిఫికేషన్‌లో అర్హతలు, ఖాళీలు, పరీక్షా విధానం, సిలబస్, ముఖ్యమైన తేదీల వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఈ రిక్రూట్‌మెంట్ పరీక్షను అక్టోబర్ 2026 నెలలో నిర్వహించనున్నారు. ఈ పోస్టులకు రూ. 58,850 నుండి రూ. 1,37,050 వరకు జీతం ఉంటుంది.
టీజీపీఎస్సీ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ / హెడ్‌మాస్టర్ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 12 జూన్ నుండి 19 జూలై 2026 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 నుండి 44 సంవత్సరాలు (జూలై 1, 2026 నాటికి) ఉండాలి.
- జనరల్ / ఓసీ – 18 నుండి 44 సంవత్సరాలు
- ఎస్సీ / ఎస్టీ / బీసీ / ఈడబ్ల్యూఎస్ – 18 నుండి 49 సంవత్సరాలు (5 సంవత్సరాల సడలింపు)
- దివ్యాంగులు (PwD) – 18 నుండి 54 సంవత్సరాలు (10 సంవత్సరాల సడలింపు)
- మాజీ సైనికులు – 3 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం సేవ చేసి ఉండాలి
పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ఈ పోస్టులను మల్టీ-జోనల్ (Multi-Zonal - MZ) పోస్టులుగా వర్గీకరించారు. మల్టీ-జోన్ I-10, మల్టీ-జోన్ II-14 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం నుండి B.Ed. కోర్సులో ప్రవేశానికి అర్హతనిచ్చే సబ్జెక్టులతో కూడిన బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. కనీసం 55 శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేట్(పీజీ) కలిగి ఉండాలి.
పరీక్షను (ఆబ్జెక్టివ్ విధానం) ఓఎంఆర్ ఆధారిత ఆఫ్లైన్ పద్ధతిలో లేదా కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ పరీక్ష (CBRT) పద్ధతిలో నిర్వహించే హక్కును కమిషన్ కలిగి ఉంది. పరీక్షా విధానాన్ని కమిషన్ వెబ్ నోట్ / పత్రికా ప్రకటన ద్వారా, హాల్ టికెట్లో తెలియజేస్తుంది.
{{/usCountry}}పరీక్షను (ఆబ్జెక్టివ్ విధానం) ఓఎంఆర్ ఆధారిత ఆఫ్లైన్ పద్ధతిలో లేదా కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ పరీక్ష (CBRT) పద్ధతిలో నిర్వహించే హక్కును కమిషన్ కలిగి ఉంది. పరీక్షా విధానాన్ని కమిషన్ వెబ్ నోట్ / పత్రికా ప్రకటన ద్వారా, హాల్ టికెట్లో తెలియజేస్తుంది.
{{/usCountry}}ఈ లింక్ క్లిక్ చేసి డీఈవో పోస్టుల నోటిపికేషన్ చదవండి
తరచూ అడిగే ప్రశ్నలు
TGPSC డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ / హెడ్ మాస్టర్ రిక్రూట్‌మెంట్ 2026 కింద ఎన్ని ఖాళీలు ఉన్నాయి?
- పాఠశాల విద్యా శాఖలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ / గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్-I పోస్టుకు మొత్తం 24 ఖాళీలను టీజీపీఎస్సీ ప్రకటించింది.
TGPSC డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ / హెడ్ మాస్టర్ పోస్టుకు జీతం ఎంత?
- ఎంపికైన అభ్యర్థులు ఇతర అనుమతించదగిన అలవెన్సులతో పాటు రూ. 58,850 నుండి రూ. 1,37,050 వరకు పే స్కేలును అందుకుంటారు.
TGPSC DEO హెడ్ మాస్టర్ పోస్టుకు ఏ విద్యా అర్హత అవసరం?
- అభ్యర్థులు యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి B.Ed. కోర్సులో ప్రవేశానికి అర్హత గల సబ్జెక్టులతో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. 55 శాతం మార్కులతో పీజీ ఉండాలి.