...
...
Next Story

TGPSC Recruitment 2026 : టీజీపీఎస్సీ నుంచి శుభవార్త - 130 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ముఖ్య తేదీలివే

TGPSC Manager Recruitment 2026 : హైదరాబాద్ జలమండలిలో 130 మేనేజర్ (ఇంజినీరింగ్) పోస్టుల భర్తీకి TGPSC నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 23 నుంచి అక్టోబర్ 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: Sep 19, 2026, 14:03:48 IST
Advertisement

TGPSC Manager Recruitment 2026 : నిరుద్యోగు అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డులో ఖాళీగా ఉన్న 130 మేనేజర్ (ఇంజినీరింగ్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం.

ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు విధానం…

జలమండలిలో 130 ఇంజినీరింగ్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్
జలమండలిలో 130 ఇంజినీరింగ్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్

ఈ పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://www.tgpsc.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్ 23, 2026
  • దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 17, 2026
  • రాత పరీక్షలు: 2026 డిసెంబరు నెలలో రాత పరీక్షలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు TGPSC తాత్కాలిక షెడ్యూల్‌లో పేర్కొంది.

ఈ పోస్టులన్నీ మల్టీజోన్-2 పరిధిలోకి వస్తాయి. 2026 జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 54,220 నుంచి రూ. 1,33,630 వరకు వేతన స్కేలు లభిస్తుంది.

మొత్తం 130 మేనేజర్ పోస్టుల్లో వివిధ ఇంజినీరింగ్ విభాగాల అభ్యర్థులకు అవకాశం కల్పించారు.

  • సివిల్ ఇంజినీరింగ్ (Civil Engineering): మొత్తం ఖాళీల్లో 80% పోస్టులు (104 పోస్టులు)
  • ఎలక్ట్రికల్ / మెకానికల్ ఇంజినీరింగ్ : 15% పోస్టులు (19 పోస్టులు)
  • సిఎస్ఇ / ఐటి / ఇసిఇ (CSE / IT / ECE): 5% పోస్టులు (7 పోస్టులు)

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks