TGPSC Recruitment : డిగ్రీ అర్హతతో 102 ప్రభుత్వ ఉద్యోగాలు - దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ

TGPSC MPSO ASO Recruitment 2026 : తెలంగాణలో 102 MPSO, ఏఎస్వో పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ తుది దశకు చేరింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఇవాళే (నవంబర్ 27) చివరి తేదీ. 

Published on: Nov 27, 2026, 18:03:15 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

TGPSC MPSO ASO Recruitment 2026 : ప్లానింగ్‌ అండ్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ దగ్గరపడింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆలస్యం చేయకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది. ఇవాళ ఒక్కరోజు మాత్రమే గడువు మిగిలి ఉంది. ఇప్పటికే ఓసారి గడువు పొడిగించిన నేపథ్యంలో…. మరోసారి పొడిగించే అవకాశం లేదు.

102 ఎంపీఎస్వో, ఏఎస్వో పోస్టులు - ఇవాళే చివరి తేదీ
102 ఎంపీఎస్వో, ఏఎస్వో పోస్టులు - ఇవాళే చివరి తేదీ

జోన్‌ల వారీగా ఖాళీల వివరాలు ఇవే

రాష్ట్రంలోని వివిధ జోన్‌ల పరిధిలో మొత్తం 102 ఖాళీలను భర్తీ చేయనున్నారు. జోన్‌ల వారీగా పోస్టుల సంఖ్య ఇలా ఉంది…

  • జోన్-1 (కాళేశ్వరం): 12
  • జోన్-2 (బాసర): 14
  • జోన్-3 (రాజన్న): 15
  • జోన్-4 (భద్రాద్రి): 17
  • జోన్-5 (యాదాద్రి): 07
  • జోన్-6 (చార్మినార్): 25
  • జోన్-7 (జోగులాంబ): 12

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి స్టాటిస్టిక్స్ ప్రధాన సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులు. లేదంటే మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టుల్లో ఏదైనా ఒకదాన్ని ప్రధాన సబ్జెక్టుగా తీసుకుని డిగ్రీ చదివి ఉండాలి. ఈ డిగ్రీ కోర్సుల్లో మొదటి, రెండో లేదా మూడో సంవత్సరంలో కనీసం ఒక్క ఏడాదైనా స్టాటిస్టిక్స్ పేపర్ చదివి ఉండాలి.

అభ్యర్థుల వయసు 2026 జులై 1 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సర్వీసు ఆధారంగా గరిష్ఠంగా ఐదేళ్ల వరకు సడలింపు వర్తిస్తుంది. ఈ పోస్టులకు ఎంపికైనవారికి నెలకు రూ. 36,750 నుంచి రూ. 1,06,990 వరకు వేతనం లభిస్తుంది.

ఎంపిక విధానం…. ఎగ్జామ్ ఇలా….

కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (సీబీఆర్టీ) లేదా ఓఎంఆర్ ఆధారిత ఆబ్జెక్టివ్ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి:

  1. పేపర్-1: జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ — 150 ప్రశ్నలు, 150 మార్కులు.
  2. పేపర్-2: స్టాటిస్టిక్స్ (డిగ్రీ స్థాయి) — 150 ప్రశ్నలు, 150 మార్కులు.

అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ www.tgpsc.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. కొత్తగా అప్లై చేసేవారు ముందుగా వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) పూర్తి చేసి టీజీపీఎస్సీ ఐడీ పొందాలి. ఇప్పటికే ఓటీఆర్ ఉన్నవారు తమ ఐడీ, పుట్టిన తేదీ, ఓటీపీ ద్వారా లాగిన్ కావాలి. వ్యక్తిగత, విద్యార్హత వివరాలను తనిఖీ చేసి పరీక్ష కేంద్రాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత ఫీజు చెల్లించి దరఖాస్తు సమర్పించాలి.

దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ. 1,000గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ. 500 చెల్లిస్తే సరిపోతుంది. పరీక్ష ఫీజు రూ. 80 ఉండగా, నిరుద్యోగ అభ్యర్థులందరికీ పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.

  • దరఖాస్తులకు చివరి తేదీ: 27.11.2026
  • రాత పరీక్ష: జనవరి 2027 (తాత్కాలికం)
  • హాల్‌టికెట్ల విడుదల: పరీక్షకు 7 రోజుల ముందు
  • అధికారిక వెబ్‌సైట్ www.tgpsc.gov.in

ఈ డైరెక్ట్ లింక్ పై క్లిక్ చేసి ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవచ్చు

ABOUT THE AUTHOR

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.