తెలంగాణలోని నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం మరొక తీపి కబురు అందించేందుకు సిద్ధమైంది. పట్టణ స్థానిక సంస్థల్లో పాలనా యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న 886 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఆర్థిక శాఖ నుంచి ఇప్పటికే అనుమతులు లభించగా, ముఖ్యమంత్రి కార్యాలయం కూడా సూత్రప్రాయ ఆమోదం తెలిపింది.

పరిపాలనా సామర్థ్యం పెంచడానికి, సాంకేతిక, అకౌంట్స్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు అధికారులు నివేదిక సిద్ధం చేశారు. ఇందులో కీలకమైన పోస్టుల ఉన్నాయి.
మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-3) 20, డిప్యూటీ కమిషనర్ (స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలు) 11, జూనియర్ అసిస్టెంట్ 86, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 56, హెల్త్ అసిస్టెంట్ 40, సీనియర్ అకౌంటెంట్ 40, జూనియర్ అకౌంటెంట్ 40, ఇతర సాంకేతిక, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బందితదితర పోస్టులు ఉన్నాయి.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు పాలనను మరింత దగ్గర చేసేందుకు 24 కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేయడంతో పాటు కొన్ని బల్దియాలను కార్పొరేషన్లుగా గ్రోత్ చేసింది. అయితే ఈ కొత్తగా ఏర్పడిన పట్టణ స్థానిక సంస్థల్లో శాశ్వత సిబ్బంది లేకపోవడంతో తీవ్ర పాలనాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ఇతర ప్రభుత్వ శాఖల నుంచి ఉద్యోగులను డిప్యుటేషన్‌పై రప్పించి నెట్టుకొస్తున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకే శాఖాపరమైన నివేదిక ఆధారంగా 886 పోస్టుల మంజూరుకు ఆమోదం లభించింది.
ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలు త్వరలోనే జరగబోయే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి అధికారిక ఆమోదం తెలపనున్నారు. కేబినెట్ ఆమోద ముద్ర పడిన వెంటనే శాఖల వారీగా రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్ ఖరారు ప్రక్రియను పూర్తి చేస్తారు. ఆ తర్వాత పూర్తి స్థాయి వివరాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు నివేదిస్తారు. అధికారుల అంచనా ప్రకారం.. జనవరిలో టీజీపీఎస్సీ నుంచి అధికారిక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం ప్రతిపాదనల దశ పూర్తయి నియామక ప్రక్రియ వేగవంతమైంది. ఉద్యోగార్థులు నోటిఫికేషన్ వచ్చే వరకు వేచి చూడకుండా, సిలబస్ ఆధారంగా ముందస్తు ప్రిపరేషన్ ప్రారంభించడం ఉత్తమం. అధికారిక వివరాలు వెలువడగానే టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు లింక్ అందుబాటులోకి వస్తుంది.
{{/usCountry}}ప్రస్తుతం ప్రతిపాదనల దశ పూర్తయి నియామక ప్రక్రియ వేగవంతమైంది. ఉద్యోగార్థులు నోటిఫికేషన్ వచ్చే వరకు వేచి చూడకుండా, సిలబస్ ఆధారంగా ముందస్తు ప్రిపరేషన్ ప్రారంభించడం ఉత్తమం. అధికారిక వివరాలు వెలువడగానే టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు లింక్ అందుబాటులోకి వస్తుంది.
{{/usCountry}}