మున్సిపల్ శాఖలో 886 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. త్వరలోనే TGPSC నోటిఫికేషన్!

తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ రానుంది. మున్సిపల్ శాఖలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

Published on: Oct 5, 2026, 15:55:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

తెలంగాణలోని నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం మరొక తీపి కబురు అందించేందుకు సిద్ధమైంది. పట్టణ స్థానిక సంస్థల్లో పాలనా యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న 886 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఆర్థిక శాఖ నుంచి ఇప్పటికే అనుమతులు లభించగా, ముఖ్యమంత్రి కార్యాలయం కూడా సూత్రప్రాయ ఆమోదం తెలిపింది.

టీజీపీఎస్సీ మున్సిపల్ ఉద్యోగాలు
టీజీపీఎస్సీ మున్సిపల్ ఉద్యోగాలు

పరిపాలనా సామర్థ్యం పెంచడానికి, సాంకేతిక, అకౌంట్స్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు అధికారులు నివేదిక సిద్ధం చేశారు. ఇందులో కీలకమైన పోస్టుల ఉన్నాయి.

మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-3) 20, డిప్యూటీ కమిషనర్ (స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలు) 11, జూనియర్ అసిస్టెంట్ 86, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 56, హెల్త్ అసిస్టెంట్ 40, సీనియర్ అకౌంటెంట్ 40, జూనియర్ అకౌంటెంట్ 40, ఇతర సాంకేతిక, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బందితదితర పోస్టులు ఉన్నాయి.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు పాలనను మరింత దగ్గర చేసేందుకు 24 కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేయడంతో పాటు కొన్ని బల్దియాలను కార్పొరేషన్లుగా గ్రోత్ చేసింది. అయితే ఈ కొత్తగా ఏర్పడిన పట్టణ స్థానిక సంస్థల్లో శాశ్వత సిబ్బంది లేకపోవడంతో తీవ్ర పాలనాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ఇతర ప్రభుత్వ శాఖల నుంచి ఉద్యోగులను డిప్యుటేషన్‌‌పై రప్పించి నెట్టుకొస్తున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకే శాఖాపరమైన నివేదిక ఆధారంగా 886 పోస్టుల మంజూరుకు ఆమోదం లభించింది.

ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలు త్వరలోనే జరగబోయే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి అధికారిక ఆమోదం తెలపనున్నారు. కేబినెట్ ఆమోద ముద్ర పడిన వెంటనే శాఖల వారీగా రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్ ఖరారు ప్రక్రియను పూర్తి చేస్తారు. ఆ తర్వాత పూర్తి స్థాయి వివరాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు నివేదిస్తారు. అధికారుల అంచనా ప్రకారం.. జనవరిలో టీజీపీఎస్సీ నుంచి అధికారిక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం ప్రతిపాదనల దశ పూర్తయి నియామక ప్రక్రియ వేగవంతమైంది. ఉద్యోగార్థులు నోటిఫికేషన్ వచ్చే వరకు వేచి చూడకుండా, సిలబస్ ఆధారంగా ముందస్తు ప్రిపరేషన్ ప్రారంభించడం ఉత్తమం. అధికారిక వివరాలు వెలువడగానే టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు లింక్ అందుబాటులోకి వస్తుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More