టీజీపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్.. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ శాఖలో ఉద్యోగాలు.. భారీ జీతం
TGPSC Recruitment 2026 : నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుభవార్త చెప్పింది. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఒక అద్భుతమైన శుభవార్త అందించింది. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ (Assistant Director of Town Planning) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

టీజీపీఎస్సీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 10 మల్టీ జోనల్ పోస్టులు ఉండగా 01/07/2026 నాటికి 18 నుండి 44 సంవత్సరాల వయసు ఉన్నవారు అర్హులుగా పేర్కొంది.
ముఖ్యమైన తేదీలు
నోటిఫికేషన్ విడుదల తేదీ: 06/07/2026
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 10/07/2026
దరఖాస్తుకు ఆఖరి తేదీ: 17/08/2026 (సాయంత్రం 5:00 గంటల వరకు)
హాల్ టికెట్ల డౌన్‌లోడ్: పరీక్ష తేదీకి 7 రోజుల ముందు నుండి అందుబాటులో ఉంటాయి.
పరీక్ష నిర్వహణ : అక్టోబర్ 2026
ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ-జోనల్ పరిధిలో మొత్తం 10 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 58,850 నుండి రూ. 1,37,050/- వరకు భారీ స్కేల్ వేతనం లభిస్తుంది.
కావాల్సిన అర్హతలు
అభ్యర్థులు బి.ఆర్క్ (B.Arch) లేదా బి.ఈ/బి.టెక్ (సివిల్) లేదా బి.ప్లానింగ్/బి.టెక్ (ప్లానింగ్) లేదా ఎం.ఏ/ఎం.ఎస్సీ (జయోగ్రఫీ) లేదా ఎం.ఎస్సీ (జియోఇన్ఫర్మాటిక్స్) కనీస విద్యార్హతగా కలిగి ఉండాలి. దీనితో పాటు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 01/07/2026 నాటికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి, గరిష్టంగా 44 సంవత్సరాలు మించకూడదు. తెలంగాణ ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిని 10 సంవత్సరాలు (34 నుండి 44 ఏళ్లకు) పెంచారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వయోసడలింపు లభిస్తుంది.
ఈ పోస్టుల ఎంపిక పూర్తిగా ఆబ్జెక్టివ్ తరహా రాతపరీక్ష (OMR ఆధారిత లేదా CBRT కంప్యూటర్ విధానం) లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా జరుగుతుంది. అర్హులైన అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ (https://www.tgpsc.gov.in) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


