TGPSC Recruitment : హైదరాబాద్ వాటర్ బోర్డులో 130 ఉద్యోగాలు - దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ

TGPSC Manager Recruitment 2026 : హైదరాబాద్ వాటర్ బోర్డులో 130 మేనేజర్ (ఇంజినీరింగ్) పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. అర్హత కలిగిన ఇంజినీరింగ్ అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో తక్షణమే దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: Oct 17, 2026, 11:30:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

TGPSC Manager Recruitment 2026 : హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు పరిధిలో ఖాళీగా ఉన్న మేనేజర్ (ఇంజినీరింగ్) ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ దరఖాస్తులను స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ దరఖాస్తు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మొత్తం 130 పోస్టుల నియామకానికి సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ నేటితో (అక్టోబర్ 17, 2026) ముగియనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇంకా దరఖాస్తు చేసుకోకపోతే వెంటనే ప్రాసెస్ పూర్తి చేయాలని కమిషన్ వర్గాలు సూచిస్తున్నాయి.

హైదరాబాద్ వాటర్ బోర్డులో 130 ఉద్యోగాలు
హైదరాబాద్ వాటర్ బోర్డులో 130 ఉద్యోగాలు

విభాగాల వారీగా పోస్టుల కేటాయింపు

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లోని ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. మొత్తం 130 మేనేజర్ పోస్టుల్లో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారికి సింహభాగం అవకాశం లభించింది.

  • సివిల్ ఇంజినీరింగ్ : మొత్తం ఖాళీలలో అత్యధికంగా 80 శాతం పోస్టులు అంటే 104 ఖాళీలను సివిల్ విభాగం అభ్యర్థులకే కేటాయించారు.
  • ఎలక్ట్రికల్ / మెకానికల్ ఇంజినీరింగ్ : 15 శాతం కేటాయింపుతో 19 ఖాళీలు ఈ విభాగానికి అందుబాటులో ఉన్నాయి.
  • కంప్యూటర్ సైన్స్ / ఐటీ / ఈసీఈ (CSE / IT / ECE) : మిగిలిన 5 శాతం కేటాయింపుతో 7 ఖాళీలను ఈ విభాగాలకు కేటాయించారు.

ఈ నోటిఫికేషన్ పరిధిలోని పోస్టులన్నీ మల్టీజోన్-2 కిందకు వస్తాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 2026 జూలై 1 నాటికి కనీసం 18 ఏళ్లు ఉండాలి. గరిష్ఠంగా 44 ఏళ్ల వరకు వయోపరిమితిని నిర్ణయించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన వర్గాలకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

ఈ మేనేజర్ పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులకు అత్యంత వేతన శ్రేణి లభిస్తుంది. ప్రారంభ వేతనం నెలకు రూ. 54,220 నుంచి మొదలై రూ. 1,33,630 వరకు పే-స్కేల్ లభించే అవకాశం ఉంది.

డిసెంబరులోనే రాత పరీక్షలు

ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించి అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించే తేదీలను టీజీపీఎస్సీ ఇప్పటికే ప్రతిపాదించింది. 2026 డిసెంబరు మాసంలోనే పరీక్షలు నిర్వహించేందుకు తాత్కాలిక షెడ్యూల్ సిద్ధం చేశారు.

నోటిఫికేషన్ వివరాలు, విద్యా అర్హతలు, వయోపరిమితి సడలింపుల సమగ్ర సమాచారం మరియు ఆన్‌లైన్ అప్లికేషన్ కోసం అభ్యర్థులు TGPSC అధికారిక వెబ్‌సైట్ https://www.tgpsc.gov.in ను పరిశీలించవచ్చు.

  • దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 17, 2026
  • రాత పరీక్ష సమయం: డిసెంబరు 2026
  • అధికారిక వెబ్‌సైట్: https://www.tgpsc.gov.in
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More