ప్రభుత్వ ఉద్యోగార్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) తియ్యటి కబురు అందించింది. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిటిక్స్‌లో ఖాళీగా ఉన్న మండల్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ (MPSO) / అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ (ASO) పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.
జీతం, దరఖాస్తు తేదీలు

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 102 జోనల్ కేడర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. జీతాల స్కేల్ చూసుకుంటే.. రూ.36,750 – రూ.1,06,990 వరకు ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం 30 అక్టోబర్ 2026 నుంచి ఉంటుది. దరఖాస్తుకు చివరి తేదీ 27 నవంబర్ 2026 వరకు అప్లై చేసుకోవచ్చు. వయోపరిమితి (01/07/2026 నాటికి) చూసుకుంటే.. కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ఠ వయస్సు 44 సంవత్సరాలుగా నిర్ణయించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్గాల వారీగా వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.
అర్హతలు
అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి కింది అర్హతలలో ఏదైనా ఒకటి కలిగి ఉండాలి. స్టాటిస్టిక్స్ ప్రధాన సబ్జెక్టుగా బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా.. మ్యాథమెటిక్స్ ప్రధాన సబ్జెక్టుగా ఉండి, అందులో కనీసం ఒక సంవత్సరం లేదా రెండేళ్లు/మూడేళ్లు స్టాటిస్టిక్స్ ఒక పేపర్‌గా చదివి ఉండాలి. ఎకనామిక్స్ ప్రధాన సబ్జెక్టుగా ఉండి, అందులో స్టాటిస్టిక్స్ ఒక పేపర్‌గా చదివి ఉండాలి. కామర్స్ ప్రధాన సబ్జెక్టుగా ఉండి, అందులో స్టాటిస్టిక్స్ ఒక పేపర్‌గా చదివి ఉండాలి. కంప్యూటర్ సైన్స్ ప్రధాన సబ్జెక్టుగా ఉండి, స్టాటిస్టిక్స్ ఒక పేపర్‌గా చదివిన అభ్యర్థులు కూడా అర్హులే.
దరఖాస్తు విధానం
అర్హులైన అభ్యర్థులు TGPSC అధికారిక వెబ్‌సైట్ https://www.tgpsc.gov.in ద్వారా ప్రొఫార్మా అప్లికేషన్‌ను పూరించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు వన్ టైమ్ రిజిస్ట్రేషన్(OTR) పూర్తి చేసి ఉండాలి. పూర్తి స్థాయి విభాగాలు, పరీక్షా సరళి, సిలబస్, రిజర్వేషన్లు, ఇతర వివరణాత్మక నోటిఫికేషన్ వివరాల కోసం TGPSC వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని కమిషన్ కార్యదర్శి తెలిపారు.
{{/usCountry}}అర్హులైన అభ్యర్థులు TGPSC అధికారిక వెబ్‌సైట్ https://www.tgpsc.gov.in ద్వారా ప్రొఫార్మా అప్లికేషన్‌ను పూరించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు వన్ టైమ్ రిజిస్ట్రేషన్(OTR) పూర్తి చేసి ఉండాలి. పూర్తి స్థాయి విభాగాలు, పరీక్షా సరళి, సిలబస్, రిజర్వేషన్లు, ఇతర వివరణాత్మక నోటిఫికేషన్ వివరాల కోసం TGPSC వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని కమిషన్ కార్యదర్శి తెలిపారు.
{{/usCountry}}