TGPSC Recruitment : టీజీపీఎస్సీ సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ నోటిఫికేషన్ అప్డేట్ - ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం, ఇదిగో లింక్

TGPSC Seed Certification Office Recruitment 2026 : తెలంగాణలో సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 12, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: Jul 8, 2026, 08:41:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

TGPSC Seed Certification Office Recruitment 2026 : వ్యవసాయ శాఖలో కీలకమైన సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ (విత్తన ధృవీకరణ అధికారి) పోస్టుల భర్తీకి సంబంధించి టీజీపీఎస్సీ ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ తాజాగా ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు.

టీజీపీఎస్సీ సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ నోటిఫికేషన్ అప్డేట్
టీజీపీఎస్సీ సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ నోటిఫికేషన్ అప్డేట్

రాష్ట్ర స్థాయి కేడర్‌లో జనరల్ రిక్రూట్‌మెంట్ కింద మొత్తం 19 విత్తన ధృవీకరణ అధికారి ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు కమిషన్ ఆగస్టు 12, 2026 వరకు గడువు ఇచ్చింది.

విద్యా అర్హతలు…

ఈ పోస్టులకు పోటీ పడాలనుకునే అభ్యర్థులు నిర్దేశిత విద్యా అర్హతలను కలిగి ఉండటం తప్పనిసరి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి అభ్యర్థులు అగ్రికల్చర్‌లో బేసిక్ డిగ్రీ (B.Sc. Agriculture) పూర్తి చేసి ఉండాలి. దీనితో పాటు, సీడ్ టెక్నాలజీ, ప్లాంట్ బ్రీడింగ్, అగ్రోనమీ లేదా ప్లాంట్ ఫిజియాలజీ వంటి విభాగాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఎం.ఎస్సీ (M.Sc. Ag.) డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

అభ్యర్థుల వయస్సు జూలై 1, 2026 నాటికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే గరిష్ట వయస్సు 44 సంవత్సరాల లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంపికయ్యే అధికారులకు నెలకు రూ. 51,320 నుండి రూ. 1,27,310 వరకు వేతన శ్రేణి లభిస్తుంది.

అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా, సాంకేతిక ఇబ్బందులను నివారించేందుకు వీలైనంత త్వరగా ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

దరఖాస్తు విధానం

  • అభ్యర్థులు ముందుగా https://www.tgpsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • మీ వివరాలను నమోదు చేసి OTR పూర్తి చేయాలి. (ఇప్పటికే రిజిస్ట్రేషన్ ఉంటే, డైరెక్ట్‌గా లాగిన్ అవ్వవచ్చు).
  • దరఖాస్తు చేసుకునేందుకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.
  • ఫీజు చెల్లించిన తర్వాత…మీ అర్హతలకు తగ్గట్టుగా ఫారం పూర్తి చేసి సబ్మిట్ చేయాలి.
  • దీంతో మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది.

అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కింద ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఈ ఫీజు రూ. 500 గా నిర్ణయించారు. దీనితో పాటు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న అభ్యర్థులందరూ అదనంగా రూ. 120 పరీక్ష రుసుము చెల్లించాల్సి ఉంటుంది. నిరుద్యోగ అభ్యర్థులకు మాత్రం ఈ రూ. 120 పరీక్ష రుసుము నుంచి పూర్తిగా మినహాయింపు ఇచ్చారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More