...
...
Next Story

ఉచితంగా హైదరాబాద్‌లో 10 నెలల యూపీఎస్‌సీ సివిల్స్ కోచింగ్.. వసతి కూడా!

యూపీఎస్సీ సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యేవారికి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఉచితంగా రెసిడెన్షియల్ ప్లస్ కోచింగ్ తీసుకునే అవకాశం వచ్చింది.

Published on: Jun 18, 2026 11:08 AM IST
Advertisement

సివిల్ సర్వీసెస్ సాధించాలనే లక్ష్యంతో ఉన్న తెలంగాణ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం సువర్ణావకాశం కల్పించింది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ (TGSC Study Circle) 2026-27 సంవత్సరానికి గాను యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్) బ్యాచ్ కోసం ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ ప్రోగ్రామ్‌ ప్రకటనను విడుదల చేసింది. ఈ ఉచిత శిక్షణ మొత్తం 10 నెలల కాలపరిమితితో కూడి ఉంటుంది.

ఉచితంగా యూపీఎస్‌సీ సివిల్స్ కోచింగ్
ఉచితంగా యూపీఎస్‌సీ సివిల్స్ కోచింగ్

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ (BC-E), దివ్యాంగులైన నిరుద్యోగ అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా గ్రాడ్యుయేషన్ లేదా ప్రొఫెషనల్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 3.00 లక్షల కంటే తక్కువగా ఉండాలి.

ఈ ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ ప్రోగ్రామ్‌కు అర్హులైన అభ్యర్థులను ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఈ ప్రవేశ పరీక్ష 19 జూలై 2026 న నిర్వహిస్తారు. ఇందుకోసం ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ 19.06.2026గా నిర్ణయించారు. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 12.07.2026. ప్రవేశ పరీక్ష 19.07.2026 రోజున ఉంటుంది.

అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సవివరమైన నోటిఫికేషన్ మరియు ఇతర వివరాల కొరకు అభ్యర్థులు http://tsstudycircle.co.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

తెలంగాణ ప్రభుత్వం, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా స్పాన్సర్ చేస్తున్న ఈ స్టడీ సర్కిల్ హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, రోడ్డు నెం. 14, కేబీఆర్ పార్కు ఎదురుగా ఉంది. మరింత సమాచారం కోసం అభ్యర్థులు కార్యాలయ ఫోన్ నంబర్: 040-23546552 ను సంప్రదించవచ్చునని స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe