ప్రధానమంత్రి పేరుతో ప్రచారంలో ఉన్న మోసపూరిత వాట్సాప్ సందేశాల పట్ల జనాలను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్బీ) హెచ్చరించింది. కేంద్రం అందరికీ రూ. 8,000 దీపావళి క్యాష్ బెనిఫిట్స్ అందిస్తోందని మెసేజులు వస్తున్నాయి. ఆ సందేశాలలో ఉన్న అనుమానాస్పద వెబ్సైట్ లింక్‌పై క్లిక్ చేయవద్దని అధికారులు హెచ్చరించారు.

పండుగ సీజన్‌ను ఆసరాగా చేసుకుని, ఇది అధికారిక ప్రభుత్వ పథకం అనే అభిప్రాయాన్ని కలిగించి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ సందేశాన్ని రూపొందించారని టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్ అన్నారు. ఇలాంటి అనుమానాస్పద లింకులు వినియోగదారులను మోసపూరిత వెబ్సైట్ల వైపు తీసుకెళ్తాయని, అవి వ్యక్తిగత, బ్యాంకింగ్ సమాచారాన్ని సేకరిస్తాయని హెచ్చరించారు. అనధికార యూపీఐ లావాదేవీలను సులభతరం చేయడానికి లేదా మెుబైల్ ఫోన్లలో హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను జొప్పించడానికి సైబర్ నేరగాళ్లకు ఆ లింకులు ఉపయోగపడతాయని శిఖా గోయల్ తెలిపారు.
'ధృవీకరించని ఇలాంటి సందేశాలను నమ్మవద్దు. వాటిపై క్లిక్ చేయవద్దు. ఫార్వార్డ్ చేయవద్దని ప్రజలకు సూచిస్తున్నాం. ఏదైనా ప్రభుత్వ నగదు ప్రయోజన పథకం వివరాలను అధికారిక ప్రభుత్వ వెబ్సైట్లు, ప్రభుత్వం జారీ చేసే అధికారిక ధృవీకరించిన ప్రకటనల ద్వారా కన్ఫామ్ చేసుకోవాలి.'అని శిఖా గోయల్ చెప్పారు.
ఇంటర్నెట్ వినియోగదారులు ఇలాంటి సందేశాలను ఫార్వార్డ్ చేయకుండా ఉండాలి. ఎందుకంటే అలా చేయడం వల్ల ఇతరులు సైబర్ మోసానికి గురయ్యే అవకాశం ఉంది. అనుమానాస్పద లింక్‌పై క్లిక్ చేసిన వారు తదుపరి సమాచారాన్ని నమోదు చేయకుండా, తమ ఖాతాలను, డివైజ్‌ను సురక్షితంగా ఉంచుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని శిఖా గోయల్ హెచ్చరించారు. ఒకవేళ అనధికార ఆర్థిక లావాదేవీ జరిగితే, బాధితులు వెంటనే తమ బ్యాంకును సంప్రదించి, 1930 నంబర్‌కు ఫోన్ చేయడం లేదా www.cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయడం ద్వారా ఈ విషయాన్ని తెలియజేయాలన్నారు.
ధృవీకరించని వెబ్సైట్లలో ఓటీపీలు, యూపీఐ పిన్లు, పాస్వర్డ్లు, బ్యాంకు ఖాతా వివరాలు లేదా ఇతర సున్నితమైన సమాచారాన్ని ఎప్పుడూ వెల్లడించవద్దని టీజీసీఎస్బీ పౌరులకు సూచిస్తోంది. అనవసరమైన సందేశాల ద్వారా ఎలాంటి డబ్బులు, గిఫ్ట్స్ రావు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లో బ్యాంకింగ్ వివరాలను, ఓటీపీలను ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు.
{{/usCountry}}ధృవీకరించని వెబ్సైట్లలో ఓటీపీలు, యూపీఐ పిన్లు, పాస్వర్డ్లు, బ్యాంకు ఖాతా వివరాలు లేదా ఇతర సున్నితమైన సమాచారాన్ని ఎప్పుడూ వెల్లడించవద్దని టీజీసీఎస్బీ పౌరులకు సూచిస్తోంది. అనవసరమైన సందేశాల ద్వారా ఎలాంటి డబ్బులు, గిఫ్ట్స్ రావు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లో బ్యాంకింగ్ వివరాలను, ఓటీపీలను ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు.
{{/usCountry}}