విద్యుత్ వినియోగదారులకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) కీలక అలర్ట్ ఇచ్చింది. ఇప్పటికే పలు సాంకేతిక ఆధారిత సేవలను అందుబాటులోకి తీసుకురాగా... తాజాగా వాట్సాప్ చాట్ ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరించే సేవలను ప్రారంభించింది. ఈ నూతన విధానం ద్వారా వినియోగదారుల సమస్యలను మరింత వేగంగా,సమర్థవంతంగా పరిష్కరించవచ్చని సంస్థ తెలిపింది.

అప్రకటికత కరెంట్ కట్, విద్యుత్ మీటర్లలో సమస్యలు, కరెంట్ బిల్లుల చెల్లింపు, స్టేటస్ వంటి వాటిని ఒక్క మెసేజ్‌తో తెలుసుకోవచ్చు. ఈ మేరకు 8712441912 నెంబర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
వాట్సాప్ సేవలను ఎలా ఉపయోగించాలి...?
- TGSPDCL విద్యుత్ వినియోగదారులు మొదటగా మీ ఫోన్‌లో 8712441912 అనే నంబర్‌ను సేవ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత, ఈ నంబర్‌కు వాట్సాప్ ద్వారా 'హాయ్' అని సందేశం పంపాలి.
- వెంటనే, 'వెల్‌కమ్ టు టీజీఎన్పీడీసీఎల్ కాల్ సెంటర్' అనే సందేశం వస్తుంది.
- వ్యూ మెనూపై క్లిక్ చేస్తే స్క్రీన్‌పై 'రిజిస్టర్ కంప్లైంట్', 'ట్రాక్ కంప్లైంట్', బిల్ రిలేటెడ్, పవర్ సప్లై స్టేటస్, 'చాట్ విత్ ఏజెంట్' అనే ఆప్షన్లు కనిపిస్తాయి.
- మీరు 'రిజిస్టర్ కంప్లైంట్' ఎంచుకుని, మీ సర్వీస్ నంబర్‌ను నమోదు చేయాలి.
- సర్వీస్ నంబర్ నమోదు చేయగానే మీ విద్యుత్ సర్వీస్ వివరాలు కనిపిస్తాయి. వివరాలు సరైనవే అయితే, మీరు ఫిర్యాదుకు సంబంధించిన మెనూను చూడవచ్చు.
- మెనూలో కనిపించే సమస్యల విభాగాల నుంచి మీకు ఎదురైన సమస్యను ఎంచుకుని ఫిర్యాదు నమోదు చేయాలి.
- ఒకవేళ మీరు నేరుగా మాట్లాడాలనుకుంటే 'చాట్ విత్ ఏజెంట్' ఆప్షన్ ఉపయోగించవచ్చు.
- ఫిర్యాదు నమోదు చేసిన వెంటనే మీకు ఒక కంప్లైంట్ ఐడీ లభిస్తుంది. ఈ ఐడీతో సమస్య పరిష్కార పురోగతిని ఎప్పుడైనా ట్రాక్ చేయవచ్చు.
ఈ వాట్సాప్ చాట్ బాట్ సేవలతో వినియోగదారుల సమస్యలను వేగంగా తెలుసుకోవటంతో పాటు పరిష్కరించవచ్చని సంస్థ అధికారులు తెలిపారు. ఈ తరహా సేవలపై వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
{{/usCountry}}ఈ వాట్సాప్ చాట్ బాట్ సేవలతో వినియోగదారుల సమస్యలను వేగంగా తెలుసుకోవటంతో పాటు పరిష్కరించవచ్చని సంస్థ అధికారులు తెలిపారు. ఈ తరహా సేవలపై వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
{{/usCountry}}