ప్రయాణికులకు, అయ్యప్ప, శివ భక్తులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC) గుడ్‌న్యూస్ అందించింది. ఒకవైపు పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడుపుతుండగా, మరోవైపు అంతర్రాష్ట్ర ప్రయాణికులకు ఊరటనిస్తూ హైదరాబాద్ నుండి బెంగళూరు, మైసూర్, విజయవాడ, గుంటూరు మార్గాల్లో టికెట్ ధరలను తగ్గించింది.
ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

Divine Destinations, Comfortable Journeys అనే నినాదంతో టీజీఎస్‌ఆర్టీసీ కార్తీక మాసం ప్రత్యేక బస్సు సర్వీసులను నిర్వహిస్తోంది. నవంబర్ 10, 2026 నుండి డిసెంబర్ 8, 2026 వరకు భక్తుల సౌకర్యార్థం వివిధ రీజియన్ల నుండి ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి.
రంగారెడ్డి రీజియన్ నుంచి పంచారామాలు, అరుణాచలం, గోల్డెన్ టెంపుల్ (వేలూరు), కాణిపాకం, శ్రీశైలానికి బస్సులు నడుపుతోంది. నల్గొండ నుంచి యాదగిరిగుట్ట, కరీంనగర్ నుంచి వేములవాడ, కాళేశ్వరం, ధర్మపురి స్పెషల్ బస్సులు నడుపుతోంది. ఇక సికింద్రాబాద్ నుంచి కీసరగుట్టకు కార్తీక మాసం స్పెషల్‌గా సర్వీసులను నడుపుతోంది.
ప్రయాణికులు ముందస్తు టికెట్ రిజర్వేషన్ల కోసం టీజీఎస్‌ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ www.tgsrtcbus.in ను సందర్శించవచ్చు. ప్రత్యేక బస్సులు, టూర్ ప్యాకేజీలు, ఆఫర్ల గురించి మరిన్ని వివరాల కోసం 040-69440000 లేదా 040-23450033 నంబర్లను సంప్రదించవచ్చు.
కార్తీక మాసంలో ముఖ్యంగా సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి రోజుల్లో పుణ్యక్షేత్రాలకు రద్దీ ఎక్కువగా ఉంటుంది. అలాగే పంచారామాలు, అరుణాచలం వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లే భక్తులు గ్రూప్ బుకింగ్ చేసుకుంటే, వారి కాలనీలు లేదా గ్రామాల నుండే నేరుగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసే వెసులుబాటును కూడా ఆర్టీసీ కల్పిస్తోంది.
ప్రయాణికులకు బంపర్ ఆఫర్
ప్రయాణికులను ఆకర్షించడంతో పాటు ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీకి అడ్డుకట్ట వేయడానికి టీజీఎస్ఆర్టీసీ నాలుగు ప్రధాన రూట్లలో టికెట్ ధరలను తగ్గించింది. డిసెంబర్ 31, 2026 వరకు ఈ ప్రత్యేక రాయితీ ధరలు అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రకటించింది. అప్ అండ్ డౌన్ ప్రయాణాలకు ఈ తగ్గింపు వర్తిస్తుంది.
{{/usCountry}}ప్రయాణికులను ఆకర్షించడంతో పాటు ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీకి అడ్డుకట్ట వేయడానికి టీజీఎస్ఆర్టీసీ నాలుగు ప్రధాన రూట్లలో టికెట్ ధరలను తగ్గించింది. డిసెంబర్ 31, 2026 వరకు ఈ ప్రత్యేక రాయితీ ధరలు అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రకటించింది. అప్ అండ్ డౌన్ ప్రయాణాలకు ఈ తగ్గింపు వర్తిస్తుంది.
{{/usCountry}}హైదరాబాద్ - బెంగళూరు ఏసీ స్లీపర్ రూ. 1,200గా నిర్ణయించారు. సర్వీసు నెంబర్ 1001, 1002. హైదరాబాద్ - మైసూర్ ఏసీ స్లీపర్ ధర రూ. 1,800గా పెట్టారు. సర్వీసు నెంబర్లు 1001, 1002. సర్వీస్ నెంబర్లు 5965, 1590 గల హైదరాబాద్ - విజయవాడ రాజధాని (RJD) బస్సులకు రూ. 500గా ధర నిర్ణయించారు. హైదరాబాద్ - గుంటూరు సూపర్ లగ్జరీ రూ. 450గా ఉంది. వీటి సర్వీస్ నెంబర్లు 1572, 1573.
ABOUT THE AUTHOR
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.