TGSRTC : కరీంనగర్-వరంగల్ నాన్‌స్టాప్ డీలక్స్ బస్సులు.. యాడ్ కాంట్రాక్టులకు టెండర్ల ఆహ్వానం!

టీజీఎస్ఆర్టీసీ కరీంనగర్-వరంగల్ మధ్య 16 నాన్‌స్టాప్ డీలక్స్ బస్సులను కొత్తగా నడుపుతోంది. మరోవైపు యాడ్ కాంట్రాక్టులకు టెండర్ల ఆహ్వానించింది.

Updated on: Nov 4, 2026, 15:49:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC) ప్రయాణికులకు వేగవంతమైన, మెరుగైన సేవలు అందించడంతో పాటు సంస్థ ఆదాయ పెంపుపై దృష్టి సారించింది. ఒకవైపు రవాణా సౌకర్యాలను విస్తరిస్తూనే, మరోవైపు ప్రకటనల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా కరీంనగర్ – వరంగల్ మార్గంలో కొత్తగా నాన్‌స్టాప్ డీలక్స్ బస్సులను అందుబాటులోకి తీసుకురాగా, సంస్థ వ్యాప్తంగా వేర్వేరు ప్రకటనల కాంట్రాక్టుల కోసం టెండర్లను ఆహ్వానిస్తోంది.

తెలంగాణ ఆర్టీసీ
తెలంగాణ ఆర్టీసీ

16 నాన్‌స్టాప్ డీలక్స్ బస్సులు

ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల మధ్య ప్రయాణించే వారి కోసం టీజీఎస్ఆర్టీసీ శుభవార్త అందించింది. కరీంనగర్‌ నుంచి వరంగల్‌ మధ్య 16 డీలక్స్‌ నాన్‌స్టాప్‌ బస్సుల సేవలు అధికారికంగా ప్రారంభించింది. సాధారణ బస్సులతో పోలిస్తే ఈ డీలక్స్ నాన్‌స్టాప్ సర్వీసుల వల్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. మధ్యలో ఆగాకుండా నేరుగా గమ్యస్థానానికి చేరుకోవచ్చు.

ఈ బస్సులు ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిరంతరం అందుబాటులో ఉంటాయి. ఈ డీలక్స్‌ నాన్‌స్టాప్‌ బస్సు సర్వీసులలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందించే మహాలక్ష్మి పథకం వర్తించదని సంస్థ స్పష్టం చేసింది. మహిళలు ఉచిత ప్రయాణం కోసం సాధారణ/పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. వరంగల్ -2 డిపో పరిధిలో ఈ కొత్త 16 నాన్‌స్టాప్ సర్వీసులతో కలిపి ప్రస్తుతం మొత్తం బస్సుల సంఖ్య 115కు చేరింది.

ప్రకటనల కాంట్రాక్టులు – బిడ్ల ఆహ్వానం

ఆర్టీసీ ఆదాయాన్ని పెంచే దిశగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి మార్గదర్శకత్వంలో టీజీఎస్ఆర్టీసీ ప్రకటనల ప్రదర్శన కోసం కాంట్రాక్టర్ల నుంచి టెండర్లను ఆహ్వానిస్తోంది.

సిటీ ఆర్డినరీ, సిటీ ఎక్స్‌ప్రెస్, డిస్ట్రిక్ట్ ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు బస్సులలో ప్రకటనల ప్రదర్శన కాంట్రాక్ట్ (హైర్ అండ్ EV బస్సులు మినహా) కోసం ఆర్టీసీ టెండర్లు ఆహ్వానిస్తోంది. కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, వరంగల్, రంగారెడ్డి రీజియన్లలో పని చేయాల్సి ఉంటుంది.

సంస్థ ఉపయోగించే టికెట్ ఇస్యూయింగ్ మెషిన్ టికెట్ రోల్స్ వెనుక భాగంలో ప్రకటనల ముద్రణ, సప్లై కాంట్రాక్టర్ కోసం కూడా టెండర్లు ఆహ్వానిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సంస్థ అంతటికోసం ఈ టెండర్లు ఆహ్వానించారు

హైదరాబాద్ ఎంజీబీఎస్‌(మహాత్మా గాంధీ బస్ స్టేషన్) పిల్లర్లపై డైనమిక్ డిజిటల్ స్క్రీన్స్, బ్యాక్‌లిట్ బోర్డులలో ప్రకటనల ప్రదర్శన కాంట్రాక్ట్ ఉంది.

బస్సులలో ప్రయాణికులు పట్టుకునే గ్రాబ్ హ్యాండిల్స్‌కు ప్రకటనల ఏర్పాటు, నిర్వహణ కాంట్రాక్ట్ (హైర్ బస్సులతో సహా) కోసం టెండర్లు ఆహ్వనిస్తోంది ఆర్టీసీ. ఆదిలాబాద్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్‌నగర్, మెదక్, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి రీజియన్లలో ఉంది.

ఆన్‌లైన్ బిడ్ సమర్పణకు చివరి తేదీ 16/11/2026 సాయంత్రం 5 గంటల వరకు ఉంది. హార్డ్ కాపీ సమర్పణ తేదీ 17/11/2026 ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 02:00 గంటల వరకు ఉంటుంది. టెండర్లకు సంబంధించిన పూర్తి వివరాలు, నిబంధనల కోసం +91 9154680020, అధికారిక వెబ్‌సైట్లు: https://www.tgsrtc.telangana.gov.in https://tender.telangana.gov.in చూడవచ్చు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More