ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. ప్రయాణీకుల సౌలభ్యాన్ని పెంపొందించడానికి “మీసేవా – మీ టికెట్ మొబైల్” యాప్ ద్వారా బస్సు టికెట్ బుకింగ్ సేవలను ప్రారంభించింది.

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కొత్త మీ సేవ మీ టికెట్ యాప్‌ను మంగళవారం ప్రారంభించారు. రవాణా శాఖ స్పెషల్ సెక్రటరీ వికాస్ రాజ్, ఆర్టీసీ వీసీ అండ్ ఎండీ వై.నాగిరెడ్డి, మీ సేవ కమిషనర్ రవికిరణ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా మొబైల్ యాప్‌ను ఆవిష్కరించి.. ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఈ సరికొత్త విధానం ద్వారా మీ టికెట్ మొబైల్ యాప్ ఓపీఆర్ఎస్ (OPRS) సేవలను కూడా అనుసంధానించారు. దీంతో ప్రయాణికులు దూర ప్రయాణాలు, ఇంటర్‌సిటీ బస్ టిక్కెట్లను కూడా డిజిటల్‌గా బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
- మొత్తం OPRS సేవలు 1,710
- ఏసీ సేవలు - 450
- నాన్ ఏసీ సేవలు - 1,260
- రోజువారీగా బుకింగ్ ఆయ్యే సీట్లు - 13,000
బెంగళూరు, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, మంచిర్యాల, ఖమ్మం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, వరంగల్ వంటి హైదరాబాద్ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ఈ టికెట్ బుకింగ్ సౌకర్యం కల్పించినట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.
గ్రేటర్ పరిధిలోని పాస్ లు కూడా…
గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో 5 రకాల బస్ పాస్‌లను కూడా పొందే సౌకర్యంతోపాటు రెన్యూవల్ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పించారు.ఈ నిర్ణయం వల్ల బస్ పాస్ కౌంటర్లకు వెళ్లే ఇబ్బందులు తప్పుతాయని… చాలా సులభంగా బస్ పాస్ రెన్యూవల్ కూడా చేసుకోవచ్చని అధికారులు వివరించారు. వీటికి సంబంధించిన కేటగిరీలు, ఛార్జీలు చూస్తే….
- సిటీ ఆర్డినరీ పా స్ -1,400(నెలకు)
- మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్ 0 రూ.1,600
- మెట్రో డీలక్స్ పాస్ - రూ.1,800
- గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ నెలవారీ పాస్ - రూ.2,200
- పుష్పక్ ఏసీ పాస్ - రూ.5,000
గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో T-24 టికెట్ ని కూడా మీ టికెట్ మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ టికెట్లు ప్రతిరోజూ 16 వేలకుపైగా సేల్ అవుతున్నట్లు పేర్కొన్నారు. పెద్దలకు రూ. 130, చిన్నారులకు రూ. 90గా ధర ఉంది.
{{/usCountry}}గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో T-24 టికెట్ ని కూడా మీ టికెట్ మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ టికెట్లు ప్రతిరోజూ 16 వేలకుపైగా సేల్ అవుతున్నట్లు పేర్కొన్నారు. పెద్దలకు రూ. 130, చిన్నారులకు రూ. 90గా ధర ఉంది.
{{/usCountry}}