...
...
Next Story

మార్చి మధ్య నుంచి చిప్‌తో మహాలక్ష్మి స్మార్ట్‌కార్డులు.. పైలట్‌లో జిల్లాకో మండలం!

మహాలక్ష్మి పథకంలో ఉచితంగా ప్రయాణం పొందుతున్న మహిళలకు త్వరలో స్మార్ట్‌కార్డులు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Published on: Feb 27, 2026 07:27 AM IST
Advertisement

తెలంగాణ ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకంలోని లబ్ధిదారుల కోసం చిప్ ఆధారిత స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టనుంది. మార్చి మధ్య నుండి పైలట్ ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే స్మార్ట్ కార్డుల కోసం టెండర్లు పిలిచారు అధికారులు. పైలట్ అమలు కోసం ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని ఎంపిక చేస్తామని టీజీఎస్ఆర్టీసీ భావిస్తోంది.

టీజీఎస్ఆర్టీసీ మహాలక్ష్మి పథకం
టీజీఎస్ఆర్టీసీ మహాలక్ష్మి పథకం

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు అందిస్తోంది. లక్షల మంది మహిళలకు ఈ పథకం వరంగా మారింది. ప్రస్తుతం మహిళలు బస్సులో వెళ్తుంటే కండక్టర్‌కు ఆధార్ కార్డు చూపించి.. జీరో టికెట్ తీసుకుంటున్నారు. ఈ విధానానికి ఆర్టీసీ గుడ్‌బై చెబుతోంది. ఇకపై స్మార్ట్ కార్డులను చూపిస్తే సరిపోతుంది.

స్మార్ట్ కార్డులకు మారడానికి జాగ్రత్తగా అమలు చేయాల్సిన అవసరం ఉందని రవాణా రంగ నిపుణులు తెలిపారు. ప్రస్తుతం, ఆధార్‌ను సమర్పించిన తర్వాత జీరో టిక్కెట్లు జారీ చేస్తున్నారు. స్మార్ట్ కార్డ్ సిస్టమ్ ప్రవేశపెట్టిన తర్వాత, అర్హత కలిగిన లబ్ధిదారులను పథకం నుండి మినహాయించకుండా చూసుకోవడానికి అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలు కూడా కొన్ని ప్రాంతాల్లో ఫేక్ ఆధార్‌లతో ప్రయాణం చేస్తున్నారు. అలాంటివారికి ఇకపై చెక్ పడనుంది.

ఆధార్ కార్డు కారణంగా చాలాసార్లు కండక్టర్, మహిళల మద్య వాగ్వాదాలు జరిగిన ఘటనలు ఉన్నాయి. కొందరు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోకపోవడంతో ఆంధ్రప్రదేశ్ అని చూపిస్తుంది. ఆధార్ కార్డు మీది కాదు అని, పొటో సరిగా కనిపించక.. ఇలా అనేక సమస్యలు కొన్నిసార్లు ఎదురవుతున్నాయి. స్మార్ట్ కార్డుతో ఈ సమస్యలు అన్నీ తీరుతాయి. ఇప్పటికే మూడు కార్డుల్లో ఒక కార్డును పైన్ చేశారని తెలుస్తోంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe